
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యేలకు తెలంగాణ హైకోర్టులో భారీ ఉపశమనం కలిగింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులోశుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా అదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా టైం ఫ్రెమ్ ఫిక్స్ చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం వినోద్ కుమార్‌కు సింగిల్ బెంచ్ ఆదేశించింది.
సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్‌పై హై కోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. స్పీకర్‌కు ఏలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టివేసింది.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సీజే ధర్మాసనం సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టివేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 10వ షెడ్యూల్, అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేసింది.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం