
అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాకు వ్యతిరేకంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా ఆయన సంచలన నిర్ణయం చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్‌ను) రష్యా భూభాగంపై దాడికి వినియోగించేలా ఉక్రెయిన్‌కు అనుమతిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు.
దీంతో రష్యాపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉక్రెయిన్‌కు దక్కుతుంది. ఉత్తర కొరియాకు చెందిన 10 వేల మంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్స్క్ ప్రాంతంలో మోహరించేందుకు రష్యా ప్లాన్ చేసినట్టు నివేదికలు అందుతోన్న వేళ అమెరికా నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ ఆయుధాల వినియోగంపై నిషేధం ఎత్తేసిన విషయాన్ని ఇంకా వైట్‌హౌస్ ధ్రువీకరించలేదు.
అయితే, రష్యాపై తొలిసారి దీర్షశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ సిద్దమవుతోందని రాయిటర్స్ నివేదించింది. వీటితో కుర్స్క్ రీజియన్‌లో రష్యా, ఉత్తర కొరియా బలగాలపై దాడిచేసే అవకాశం ఉందని తెలిపింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అమెరికా అనుమతించడంతో రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాలపై దాడికి కీవ్‌ను అనుమతిస్తుంది.
సంఘర్షణ పెరిగే ప్రమాదం ఉన్నందున బైడెన్ యంత్రాంగం మొదట్లో వీటి వినియోగంపై నిషేధం విధించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రష్యా గగనతల దాడుల ముప్పు ముఖ్యంగా క్షిపణి దాడులను అడ్డుకోడానికి ఉక్రెయిన్‌కు అమెరికా పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అందజేసింది. ఈ వ్యవస్థ సాయంతో క్షిపణులు, యుద్ధ విమానాల దాడులను అడ్డుకుంటోంది.
హై మొబలిటీ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థ, అబ్రామ్స్ ట్యాంకులు, జావెలిన్ అండ్ స్టింగర్ మిసైల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, ఇతర పశ్చిమ దేశాధినేతలు రష్యాలోని సైనిక లక్ష్యాలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులకు ఉక్రెయిన్‌ను అనుమతించాలని బైడెన్‌పై నెలల తరబడి ఒత్తిడి చేస్తున్నారు.
అమెరికా నిషేధం వల్ల ఉక్రెయిన్ తన నగరాలు, విద్యుత్ వ్యవస్థలపై రష్యా దాడులను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని వాదించారు. ఓ నివేదిక ప్రకార రష్యాతో పోరాడుతోన్న ఉక్రెయిన్‌కు అమెరికా నిర్ణయం నష్టాన్ని కలిగిస్తుందని వాదించారు. ఈ చర్చ నాటో మిత్రదేశాల మధ్య విభేదాలకు బీజం వేసింది. దీనిపై బైడెన్ వ్యతిరేకిస్తూనే వచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఆయన జనవరి 20న అమెరికాకు 47 వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. అంటే మరో రెండు నెలల్లో అధికార మార్పిడి జరగనుండగా జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
తాను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగిసిపోతుందని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!