జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 2022 నవంబరు 11 నుంచి 2023 ఏప్రిల్ 16 వరకు త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టులో 40 శాతం పెండింగు కేసులను, త్రిపుర హైకోర్టులో 60 శాతం పెండింగు కేసులను పరిష్కరించారు.
“జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి చెప్పుకోదగ్గ రికార్డును సాధించారు. 2017 నుంచి 2024 వరకు హైదరాబాద్, త్రిపుర హైకోర్టులలో 91,157 వ్యక్తిగత కేసులను పరిష్కరించడంలో వారి అసాధారణమైన విజయాన్ని మేము గుర్తించాం, రోజుకు సగటున 109 కేసులను పరిష్కరించారు. మీ అత్యుత్తమ నిబద్ధత న్యాయ సాధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది” అని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ తెలిపింది.
రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ భారతదేశ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్, లయన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!