
కొన్ని వందల ఏళ్ల క్రితం భక్తురాలు విరాళంగా ఇచ్చిన భూమి ఎట్టకేలకు సింహగిరిపై ఉన్న కాశీవిశ్వేశ్వర పంచాయతన దేవాలయానికి చెందేలా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సింహాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు వెల్లడించారు.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సర్వే నంబర్లు 3/1, 3/4లలోని సుమారు 102 ఎకరాలను కాశీ విశ్వేశ్వరునికి ఒకరు విరాళంగా ఇచ్చారు. ఆ భూమిపై 2009లో మేడూరి అప్పలనరసింహమూర్తి అనే వ్యక్తి దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేయగా 2010లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
దానిపై 2010లో మరొకసారి అప్పలనరసింహమూర్తి రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. ఆ రిట్ పిటిషన్‌ను ఈనెల ఐదో తేదీన హైకోర్టు కొట్టివేసింది. న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో శుక్రవారం దేవదాయ శాఖ విశాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.అన్నపూర్ణ భూమికి చెందిన దస్త్రాలను సింహాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావుకు అందజేశారు
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధంగా కాశీవిశ్వేశ్వరస్వామి కోవెల ఉంది. ఈ ఆలయానికి సర్వే నంబర్లు 3/1, 3/4లలో 99.20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి దాతల ద్వారా సంక్రమించగా.. ఏళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. సింహాచలం ఆలయ అధికారులకు ఈ విషయం తెలియడంతో.. 2009లో ఎండోమెంట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ మరుసటి ఏడాది దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ భూ ఆక్రమణదారులు 2010లో హైకోర్టును ఆశ్రయించగా 14 ఏళ్ల విచారణ అనంతరం ఈ నెల 5న కోర్టు ఆక్రమణదారులు వేసిన రిట్‌ను కొట్టేసింది. ఈమేరకు దేవాదాయశాఖ విశాఖ జిల్లా సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ, వీఆర్వో గంప వరహాలు సమక్షంలో సింహాచలం ఆలయ ఈవో త్రినాథరావు, దేవస్థానం భూపరిరక్షణ విభాగం ఎస్‌డీసీ కె.గీతాంజలి ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
హైకోర్టులో దేవస్థానం తరఫున వాదనలు వినిపించిన ప్రత్యేక లీగల్‌సెల్ న్యాయవాది ఎన్‌వీఎస్ ప్రసాద్‌వర్మను ఈవో త్రినాథరావు అభినందించారు. ఈ 99.20 ఎకరాల భూమి జాతీయ రహదారి-16 పక్కనే ఉండటంతో.. ఈ భూమిని కాపాడేందుకు ప్రహరీ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఈఓ తెలిపారు.
ఇక్కడ భూముల అమ్మకాలు జోరుగా సాగుతున్నందున ఆలయ భూమి విలువ కూడా పెరుగుతుంది అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ జీడి, మామిడి, కొబ్బరి, టేకు తోటలు ఉన్నాయని, వాటి ఫల ఉత్పత్తిని వేలం వేసి దేవస్థానానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని సింహాచలం ఆలయ ఈవో త్రినాథరావు చెప్పారు.
అది మరొకసారి అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, దానిలో ప్రస్తుతం ఉన్న పండ్ల చెట్లను లెక్కగట్టి బహిరంగ వేలం ద్వారా ఫలసాయం అనుభవించేందుకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలో మరికొన్ని భూములను కూడా కోర్టు ఆదేశాలతో స్వాధీనం చేసుకోనున్నట్టు ఈఓ ప్రకటించారు.
More Stories
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్
ఈ20 బ్లెండింగ్ పై సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్