మహిళల ఆసియా ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్ విజయం

మహిళల ఆసియా ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్ విజయం

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 13-0 గోల్స్ తేడాతో థాయిలాండ్‌ను చిత్తు చేసింది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన భారత్ సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ప్రత్యర్థి టీమ్‌పై గోల్స్ వర్షం కురిపించింది. 

ఆరంభం నుంచే వరుసగా గోల్స్‌తో థాయిలాండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. యువ స్ట్రయికర్ దీపిక అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ఏకంగా నాలుగు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషింది. ఆట మూడో నిమిషంలోనే దీపిక భారత్‌కు తొలి గోల్ అందించింది. 9వ నిమిషంలో ప్రీతి దూబె, 12వ నిమిషంలో లాల్‌రెమ్‌సియామి గోల్స్ సాధించారు. దీపిక 19వ నిమిషంలో మరో గోల్ నమోదు చేసింది.

30వ నిమిషంలో డంగ్ డంగ్ కూడా గోల్ సాధించింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 5-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో మరింత దూకుడును ప్రదర్శించింది. 40వ నిమిషంలో ప్రీతి దూబే తన రెండో గోల్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత దీపిక వరుసగా మూడు గోల్స్ సాధించింది. 

రెండు నిమిషాల వ్యవధిలో దీపిక ఈ గోల్స్ సాధించడం కాగా, దీపిక ఐదు గోల్స్ సాధించగా, ప్రీతి,మనీషా, లాల్‌రెమ్‌సియామి తలో రెండు గోల్స్ చేశారు. డంగ్‌డంగ్, నవ్‌నీత్ కౌర్ ఒక్కొ గోల్ సాధించారు. ప్రత్యర్థి టీమ్‌లో ఏ ఒక్కరూ కూడా గోల్స్ సాధించలేక పోయారు. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో రికార్డు విజయం సాధించిన భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది.

భారత్‌ తరఫున యువ స్ట్రైకర్‌ దీపికా ఏకంగా 5 గోల్స్‌ (3, 19, 43, 45, 45వ నిమిషాలు)తో సత్తా చాటగా ప్రీతి దూబె (9, 40వ ని.), లల్రెమ్‌సియామి (12, 56వ ని.), మనీషా చౌహాన్‌ (55, 58వ ని.) చెరో రెండు గోల్స్‌ చేశారు. బ్యూటీ డంగ్‌డంగ్‌ (30వ ని.), నవ్‌నీత్‌ కౌర్‌ (53వ ని.) తలా ఓ గోల్‌ చేశారు. ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్‌.. శనివారం చైనాతో తలపడనుంది.