
నెహ్రూ నుంచి మొదలుకుంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల వరకు గాంధీ – నెహ్రు కుటుంభం నుండి వివిధ తరాల వ్యక్తులు భారత రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వారి కుటుంభం పార్టీగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ఐదో తరం వ్యక్తి రాజకీయ అరంగేట్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసేలా ఇటీవల దీపావళి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో తన మేనల్లుడు, ప్రియాంక గాంధీ వాద్రా-రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా కనిపించడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
సరిగ్గా ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ ఉపఎన్నికలో పోటీ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న వేళ రైహాన్ వాద్రా రాజకీయ అరంగేట్రం వార్తలు వ్యాపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రైహాన్ వాద్రా కనిపించారు. అయితే రైహాన్ వాద్రా బయట కనిపించడం చాలా అరుదు.
24 ఏళ్ల విజువల్ ఆర్టిస్ట్, క్యూరేటర్ అయిన రైహాన్ రాజీవ్ వాద్రా రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇక అతడు వైల్డ్ లైఫ్, కమర్షియల్ ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో రైహాన్ రాజీవ్ వాద్రా తన పనికి సంబంధించిన ఎగ్జిబిషన్ ప్రదర్శనలు చేశారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు