స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్

స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్

బిసి రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల కు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం ఒక జీవో విడుదల చేసిన విష యం విదితమే. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బిసి కమిషన్‌కు అప్పజెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకోసం రెండు వారాల్లో ప్రత్యేకంగా క మిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బిసి కమిషన్‌కు అధ్యయనం చేసే బాధ్యత ను సవాల్ చేస్తూ బిసి సంక్షేమ సంఘ నేత ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం జస్టిస్ ఎస్.నంద ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా, సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసా ద్ పిటిషనర్ పక్షాన వాదనలను వినిపించారు. రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసే బాధ్యతను బిసి కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

‘ప్రజాప్రయోజన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలను ధర్మాసనం సమర్థించింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు గానూ ‘ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‘ను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్‌ల శాతంను నిర్ణయించడానికి వీలుగా డాక్టర్ కె. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను పాటించి తెలంగాణలో కూడా ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వం హై కోర్టు ఆదేశించింది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇలాగే బిసి కమిషన్ చేసిన అధ్యయనాన్ని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువస్తూ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.