
* 27 గంటలపాటు సాగిన ఆర్మీ ఆపరేషన్
మంగళవారం సాయంత్రం జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లో దట్టమైన అడవుల్లో దాక్కున్న పాకిస్థానీయులుగా భావిస్తున్న మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందించగలిగాయి. సోమవారం ఒక అల్ట్రా మరణించాడు. మరణించిన ఉగ్రవాదుల నుండి సైన్యం యుద్ధంపై ఉపయోగించే పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది.
దీపావళికి ముందు జరుగుతున్న పండుగ సీజన్‌లో వారు బహుశా జమ్మూలో దాడులకు ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. జమ్మూకు చెందిన ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఒక ప్రకటనలో, “తీవ్రమైన కాల్పుల తర్వాత ముగ్గురు హార్డ్‌కోర్ టెర్రరిస్టులు హతమయ్యారు. రాత్రంతా రౌండ్ ది క్లాక్ నిఘా తరువాత, ఈ రోజు ఉదయం తీవ్రమైన కాల్పులు జరిగాయి. ఫలితంగా మా దళాలకు గణనీయమైన విజయం లభించింది” అని తెలిపాయి.
వాస్తవాధీన రేఖ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌లో భాగమైన అంబులెన్సుపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. భద్రతా దళాల ఆపరేషన్‌లో సోమవారం సాయంత్రానికి ఒక ఉగ్రవాది అంతం కాగా జోగ్వాన్ గ్రామలోని అస్సాన్ ఆలయం వద్ద మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాల ఎదురు కాల్పులలో మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
దాదాపు 27 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో బిఎంపి 2 ఇన్‌ఫాంట్రీ కంబాట్ వాహనాలను, ప్రత్యేక దళాలు, ఎన్‌సిజి కమాండోలు పాల్గొనగా వారికి హెలికాప్టర్లు, డ్రోన్లు సహకరించాయి. “కనికరంలేని ఆపరేషన్లు, వ్యూహాత్మక నైపుణ్యం ముగ్గురు ఉగ్రవాదులను నిర్మూలించడానికి దారితీసింది. ఈ ఆపరేషన్ యుద్ధం లాంటి పరికరాలను విజయవంతంగా పునరుద్ధరించడాన్ని కూడా చూసింది. ఈ ప్రాంతంలో భద్రతను కొనసాగించడంలో కీలకమైన దశను సూచిస్తుంది” అని పేర్కొన్నారు.
మంగళవారం వెలుగు రాగానే తీవ్రవాదులు సైన్యపు బలమైన వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ వెంటనే సైన్యం వారిని తిప్పి కొట్టింది. ఆ ప్రాంతంలోని అస్సాన్ దేవాలయం సమీపంలో ఉగ్రవాదులు దాక్కున్నారు. దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు హ్యాండ్లర్ విడుదల చేసిన సమయంలో సైన్యం సోమవారం ‘ఫాంటమ్’ అనే కుక్కను కోల్పోయింది. కుక్కకు బుల్లెట్ తగిలి చనిపోయింది.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు