
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిరస్కరిస్తున్న పేర్కొన్న ఈసీ, ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఘాటుగా లేఖ రాసింది. ఇటువంటి పనికిమాలిన సందేహాలు పోలింగు, కౌంటింగ్ వంటి ప్రక్రియలు కొనసాగుతున్న సమయంలో అల్లకల్లోలం సృష్టించే అవకాశాలు ఉన్నాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఒక జాతీయ పార్టీ నుంచి ఇది ఆశించిన వైఖరి కాదని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా రాజకీయ పార్టీలు వెలిబుచ్చే విమర్శనాత్మక అభిప్రాయలను ఈసీ అభినందిస్తుందని స్పష్టం చేసింది. “ఓ జాతీయ పార్టీ నుంచి ఇటువంటివి ఊహించలేదు. దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా రాజకీయ పార్టీలు పంచుకునే అభిప్రాయాలను ఎన్నికల సంఘం అభినందిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం” అని పేర్కొంటూ మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ రాసింది.
ఎలాంటి ఆధారాలు చూపకుండా ఎన్నికల ప్రక్రియలో రాజీ పడ్డారని చెబుతున్నారని తెలిపింది. గతంలో మాదిరిగా సాధారణ సందేహాలనే కాంగ్రెస్ లేవనెత్తిందని వారి విధానాలను మార్చుకోవాలని సూచించింది. ఆ మేరకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పింది.
ఈవిఎంలలో బ్యాటరీ సామర్థ్య ప్రదర్శమ హెచ్చుతగ్గులపై సందేహాలు ఉన్నాయని కాంగ్రెస్ 26 నియోజవర్గాల్లో కొనసాగిన ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులతో ఈసీకి 8 పేజీల లేఖ రాసింది. దీనికి బదులుగా ఈవిఎంలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన 42 తీర్పులను సైతం ఉటంకిస్తూ ఏకంగా 16 వందల పేజీల ద్వారా ఈసీ వివరణ ఇచ్చింది.
హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో ఈసీ పని తీరుతో పాటు ఈవీఎంలపైనా కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని, తమ విజయాన్ని బలవంతంగా లాక్కొన్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారులను కలిసి, ఓట్ల లెక్కంపుపై ఫిర్యాదు చేసింది.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం