* సరిహద్దు మూసేయమని ఈసీని కోరిన శివసేన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టల్ని తరలించనున్నదా? గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పని చేసిందా? శివసేన (షిండే వర్గం) కార్యదర్శి, పార్టీ ప్రతినిధి కిరణ్ పావస్కర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవే అనుమానాలను కలిగిస్తున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలంటూ ఆయన ఏకంగా ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మరికొద్దిరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కిరణ్ పావస్కర్ మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి రూ. కోట్లు మూటల్లో రానున్నాయని ఆరోపించారు.
“ఈ రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ నోట్ల కట్టలను ట్రక్కుల్లో తరలించనున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఎన్నికలకు పార్టీ అబ్జర్వర్లుగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. వాళ్లే ఆ డబ్బును మహారాష్ట్రకు తరలించనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ మహా వికాస్ అఘాడీకి ఇలాగే ఈ రెండు రాష్ర్టాల నుంచి పెద్దయెత్తున డబ్బు వచ్చి చేరింది” అని కిరణ్ పావస్కర్ ఆరోపించారు.
‘అక్రమ మూటలు మహారాష్ట్రకు చేరకుండా ఉండాలంటే మహారాష్ట్రతో హద్దులను పంచుకొన్న తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలి. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాం’ అని కిరణ్ పావస్కర్ వెల్లడించాయిరు. ఈ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ, కర్ణాటక నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా మహారాష్ట్ర కాంగ్రెస్‌కు డబ్బుల మూటలు అందనున్నాయని ఆయన ఆరోపించారు.ప్రస్తుతం ఆర్థికపరంగా చూస్తే కర్ణాటక కన్నా తెలంగాణయే పచ్చగా కళకళలాడుతున్నదని చెప్పవచ్చు. అక్కడ ఉన్న సీఎం తొలిసారిగా ముఖ్యమంత్రి కావడమే కాక, పార్టీకి పూర్తి విధేయుడుగా ఉన్నందున అక్కడి నుంచి భారీ నిధులను ఆ పార్టీ ఆశిస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలో ఇప్పుడు మూసీ నది పునరుద్ధరణ పేరుతో రూ. 1.5 లక్షల కోట్ల భారీ ప్రాజెక్టుకు తెరతీసారని ఆరోపణలు వస్తున్నాయి.
గతవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రయాణించిన హెలికాఫ్టర్ తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నదే కావడం ఇటువంటి అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తుంది. పైగా, వాయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల నిధులు సహితం తెలంగాణ నుండే సమకూర్చనున్నారని భావిస్తున్నారు.
అలాగే ఇటీవల హైడ్రా పేరుతో రియల్టర్లను బెదిరించడం ప్రారంభమైందని, వారి నుంచి పెద్దమొత్తంలోనే నిధులను సేకరిస్తారని అంటున్నారు. కిరణ్ పావస్కర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరపడుతున్నా ఇస్తామన్న ఆరు గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదు. అభివృద్ధి, సంక్షేమం మాటను పక్కనబెట్టింది.

రైతుల రుణమాఫీ, రైతు భరోసా, పింఛన్ల పెంపు ఎప్పుడో అటకెక్కాయి. అయినప్పటికీ, కొత్త ప్రభుత్వం రూ. 80 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఓ ఏటీఎమ్‌గా వాడుకొంటున్నదా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు.
సరిగ్గా హర్యానా ఎన్నికల ముందే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేయడం, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నట్టుండి జార్ఖండ్‌లో పర్యటించడం ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్ డబ్బులను కాంగ్రెస్ నేతలు వినియోగించడం, ఆ డబ్బు తెలంగాణకు తరలినట్టు ఈడీ విచారణలో తేలడం గమనార్హం.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్