
కాగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘గడియారం’ చిహ్నాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం విచారణ సందర్భంగా శరద్ పవార్ వర్గం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ఎన్సీపీతోపాటు గడియారం సింబల్‌పై వివాదం ఉన్నదని కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గంతో తమకు సంబంధం లేదన్న విషయాన్ని ఎన్నికల పోస్టర్లలో అజిత్ పవార్ వర్గం ప్రకటించలేదని ఆరోపించారు. ప్రత్యర్థి శిబిరం ఓట్లు పొందడం కోసమే శరద్ పవార్‌తో అనుబంధాన్ని ఆ వర్గం కోరుకుంటోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజాగా హామీ ఇవ్వాలంటూ అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది.
మరోవైపు 2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేశారు. తన వర్గంతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వంలో చేరారు. అయితే ఆయన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. ‘గడియారం’ గుర్తును ఆ వర్గానికే కేటాయించింది.
ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం పార్టీని ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్‌చంద్ర పవార్’గా, తుర్హాఊదుతున్న వ్యక్తిని చిహ్నంగా వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. అయితే శరద్ పవార్ పేరు, ఫొటోలను రాజకీయ ప్రయోజనాల కోసం అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు