
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మద్‌లోని మొహందిలో నక్సల్స్ మందుపాతరకు పాల్పడ్డారు. ఈ పేలుడులో నలుగురు ఐటీబీపీ జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఇద్దరి పరిస్థితి మెరుగ్గానే ఉందని.. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స నిమిత్తం విమానంలో రాయ్‌పూర్‌కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. టిబెట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉమ్మడి పార్టీ నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా, మొండి, ఎరత్‌బట్టి ప్రాంతం నుంచి సెర్చ్ ఆపరేషన్ కోసం ధుర్బేరాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నక్సల్స్ ఐఈడీతో పేల్చారు.
కోడ్లియర్ గ్రామ సమీపంలోని అడవిలో మందుపాతర పేలగా.. నలుగురు సైనికులు గాయపడ్డారు. ఇందులో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించగా మృతి చెందినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మృతులను మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమర్ పన్వర్ (36), ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన కే రాజేశ్ (36)గా గుర్తించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్