
అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడికి ఆయన సూత్రధారి, హమాస్ కీలక నేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) గాజాలో నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు హమాస్ ఫైటర్లను మట్టుపెట్టినట్లు ప్రకటించింది. గాజాలోని రఫా పట్టణంపై ఐడీఎఫ్ ఈ నెల 7న చేసిన దాడిలో సిన్వార్ హతమైనట్టు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి కట్జ్ గురువారం నిర్ధారించారు. ఇది ఇజ్రాయెల్‌కు గొప్ప సైనిక, నైతిక విజయం అని ఆయన తెలిపారు.
“హోలోకాస్ట్ తర్వాత మా ప్రజల చరిత్రలో అత్యంత ఘోరమైన ఊచకోత”గా అభివర్ణించిన హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్‌తో ఇజ్రాయెల్ “తన ఖాతాని పరిష్కరించుకుంది” అని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని తిరిగి పొందేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో సిన్వార్ మరణాన్ని ఒక ముఖ్యమైన మలుపుగా నెతన్యాహు అభివర్ణించారు.
కొద్దిరోజుల కిందట లెబనాన్‌లో వైమానిక దాడుల్లో హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన క్రమంలోనే తాజాగా గాజాలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. అంతకుముందు ఇరాన్‌లో జరిగిన దాడిలో హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది, ఇది “తప్పుడు, సరికాని వార్తలు” అని పేర్కొంది. తమ నాయకుడు క్షేమంగానే ఉన్నదంటూ వాదించింది.
హనియ్య హమాస్ రాజకీయ విభాగానికి చీఫ్‌గా యాహ్యా సిన్వర్ నియామకయ్యారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులకు సిన్వర్ సూత్రధారిగా భావిస్తున్నారు. ఇటీవల గాజాలోని హమాస్ ప్రభుత్వ అధిపతి రౌహి ముష్తాహా, హమాస్ రాజకీయ కార్యాలయంలోని భద్రతా విభాగం అధిపతి సమా అల్-సిరాజ్‌తో సహా పలువురు హమాస్ ఉన్నతాధికారులను ఐడీఎఫ్ హతమార్చింది.
గత మూడు రోజుల్లో జబాలియాలో జరిగిన వైమానిక దాడుల్లో సుమారు 20 మంది హమాస్ ఆపరేటర్లు మరణించారని గత మంగళవారం ఐడీఎఫ్ తెలిపింది. ఆయుధ డిపో, ఇతర ఆయుధాలను సైతం ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో తీవ్రవాద గ్రూపు మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేసే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
యాహ్యా సిన్వర్ గాజా స్ట్రిప్‌లోని హమాస్ అగ్ర నాయకుడు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ప్రధాన సూత్రధారి యాహ్యా సిన్వర్‌గా భావిస్తున్నారు. సిన్వర్ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరున్నది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్‌పై పోరాటానికి ఆయుధాల ప్రయోగంలో శిక్షణ పొందిన వారిని నియమించి ఒక సంస్థను స్ధాపించాడు.
కాసమ్ బ్రిగేడ్స్‌గా పేరొందిన ఆ గ్రూప్ తర్వాత హమాస్ మిలటరీ వింగ్‌గా మారింది. అనంతరం అతడిని అరెస్ట్ చేసిన ఇజ్రాయెల్ 426 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 23 ఏండ్లు అతను ఇజ్రాయెల్ జైలులో గడిపాడు. 2011లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్‌ను విడిచిపెట్టేందుకుఖైదీల ఒప్పందంతో ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలైన 1,027 మంది పాలస్తీనా ఖైదీల్లో యాహ్యా సిన్వర్ ఒకడు. 2014లో హమాస్‌లో ప్రధాన నేతగా ఎదిగాడు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్