బంగ్లాదేశ్ లో హిందూ జర్నలిస్ట్ హత్య

బంగ్లాదేశ్ లో హిందూ జర్నలిస్ట్ హత్య
బంగ్లాదేశ్‌లో గత కొద్ది రోజులుగా జర్నలిస్టుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి, తాజాగా ఓ సీనియర్ హిందూ జర్నలిస్టును ముగ్గురు ముస్లిం యువకులు నరికి చంపారు. దైనిక్ స్వజన్, అజ్కేర్ ఖబర్, ఖబర్ పాత్ర అనే బెంగాలీ వార్తాపత్రికలలో పనిచేసిన స్వపన్ కుమార్ భద్ర (65)ను గత శనివారం మైమెన్‌సింగ్ ప్రాంతంలోని మాజిపారాలో ఉన్న ఆయన నివాసం ముందు లక్ష్యంగా చేసుకొని దారుణంగా హత్యా చేశారు.
 
భద్ర ప్రస్తుతం ఏ వార్తాపత్రికకు రాయడం లేదు, కానీ ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు. అక్కడ తారకాండ ప్రెస్ క్లబ్ మాజీ ఉపాధ్యక్షుడిగా  తీవ్రవాదం, మాదకద్రవ్యాల బెదిరింపు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు వంటి అనేక సంబంధిత అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇప్పటికే సాగర్ మియాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
బహిరంగంగా మాట్లాడే మీడియా వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో పాటు చాలా మంది బంధువులు, శ్రేయోభిలాషులను విడిచిపెట్టాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన మరో జర్నలిస్టు హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, జెనీవాకు చెందిన గ్లోబల్ మీడియా సేఫ్టీ అండ్ రైట్స్ బాడీ ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపెయిన్ (పిఇసి) దోషులను శిక్షించాలని, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని ఢాకాలోని అధికారులను కోరింది.
 
పిఇసి అధ్యక్షుడు బ్లేస్ లెంపెన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఇప్పటికే 110కి చేరుకున్న ప్రపంచ జర్నలిస్ట్ బాధితుల జాబితాలో బాంగ్లాదేశ్ మరో జర్నలిస్టును చేర్చిందని పేర్కొన్నారు. “మేము ఈ సంఘటనను ఖండిస్తున్నాము.  బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయడంలో వ్యక్తిగత ఆసక్తి చూపాలని తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్‌ను కోరుతున్నాము” అని లెంపెన్ తెలిపారు.
 
ముస్లిం మెజారిటీ దేశం ఇటీవల హసన్ మెహెదీ, షకిల్ హొస్సేన్, అబు తాహెర్ ఎండి తురాబ్, తాహిర్ జమాన్ ప్రియో, ప్రదీప్ కుమార్ భౌమిక్, తాంజిల్ జహాన్ ఇస్లాం తమీమ్ అనే ఆరుగురు మీడియా వ్యక్తులను దుండగుల చేతిలో కోల్పోయిందని  పిఇసి దక్షిణాసియా ప్రతినిధి నవా ఠాకూరియా తెలియజేశారు.  మరో దక్షిణాసియా దేశమైన పాకిస్థాన్ పది మంది జర్నలిస్టులను కోల్పోయింది, అంటే నిసార్ లెహ్రీ, ముహమ్మద్ బచల్ ఘునియో, మాలిక్ హసన్ జైబ్, ఖలీల్ అఫ్రిది జిబ్రాన్, నస్రుల్లా గదానీ, కమ్రాన్ దావర్, మెహర్ అష్ఫాక్ సియాల్, మౌలానా మొహమ్మద్ సిద్ధిక్ మెంగల్, జామ్ సఘీర్ అహ్మద్ లార్షేన్,తహిమద్ అహ్మద్ లు హత్యలకు గురయ్యారు.