
నావిగేషన్, ఎయిర్‌స్పేస్‌పై స్వేచ్ఛ ఉండాలని చెబుతూ ప్రాంతీయ దేశాల విదేశీ విధానాలపై ఆంక్షలు ఉండవద్దని హితవు చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కానీ విస్తరణపై కాదని రాదని హెచ్చరించారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతోపాటు అంతర్జాతీయ చట్టాలను సైతం గౌరవించాల్సి ఉందని మోదీ స్పష్టం చేశారు.
చర్చలకు, దౌత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలో విశ్వ బంధు భారత్ అన్ని విధాలుగా సహకరాన్ని అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా పక్కనే ఉన్న మయన్మార్‌తో భారత్ కలిసి నడుస్తుందని చెప్పారు.
పొరుగుదేశం భారత్ తన బాధ్యతను కొనసాగిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో తూర్పు ఆసియా సదస్సు అత్యంత ముఖ్యమైనదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.
కాగా, ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాక్ దేశాల మధ్య పోరు రోజూ రోజుకు తీవ్రతరం అవుతుంది. అలాగే పలు దేశాల మధ్య సంబంధాలు సైతం ఉప్పు నిప్పు తరహాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం లండన్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జ్యూరిట్స్ అండ్ రైటర్స్ ఫర్ వరల్డ్ ఫీస్ స్పందించింది. ఈ ఘర్షణలను నిలుపుదల చేసేందుకు శాంతి దౌత్యం జరపాలని ప్రధాని మోదీకి ఈ ప్రపంచ సదస్సులో పాల్గొన్న ప్రముఖులు విజ్జప్తి చేశారు. అందుకోసం వెంటనే రంగంలోకి దిగాలని వారు సూచించారు. లేకుంటే మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశముందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము