
14 శాతం మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 2019లో పోలిస్తే పది శాతం ఎక్కువగా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 11 సీట్లను గెలుచుకున్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. ఐఎన్‌ఎల్‌డీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి.
96శాతం బీజేపీ, 95శాతం కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వందశాతం తమకు రూ.కోటికి కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సావిత్రి జిందాల్ రూ.270కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.145 కోట్లతో బీజేపీకి చెందిన శక్తి రాణిశర్మ, రూ.134 కోట్ల ఆస్తులతో శృతి చౌదరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తిరిగి ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తులు 59 శాతం పెరిగాయి. ఈసారి ఎన్నికల్లో 30 మంది ఎమ్మెల్యేలు మరోసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 2019 నుంచి వారి సగటు ఆస్తులు 59శాతం పెరిగాయి. గతంలో రూ.9.08కోట్లు ఉండగా ఇప్పుడు రూ.14.46కోట్లకు ఆస్తులు పెరిగాయి. క్రిమినల్ కేసుల్లోనూ స్వతంత్రులు అగ్రస్థానంలో ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డయ్యాయి. అందులో ఆరుగురిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఒకరిపై హత్యాయత్నం కేసు ఉన్నది.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం