
ఈ సందర్భంగా మహారాష్ట్రలో 10 వైద్య కళాశాలల ప్రారంభోత్సవం సహా రూ.7,600 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ముందుగా ఆయన 10 వైద్య కళాశాలలను ప్రారంభించారు. ముంబై, నాసిక్, జల్నా, అమరావతి, గడ్చిరోలి, బుల్దానా, వాషిం, భండారా, హింగోలి, అంబర్‌నాథ్(థానే)లలో వైద్య కళాశాలలను మోదీ ఏక కాలంలో ప్రారంభించారు.
నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.7వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీని ద్వారా విమానాశ్రయం అప్‌గ్రేడ్, విమానయానం, పర్యాటకం, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్‌తో సహా బహుళ రంగాల్లో నాగ్‌పూర్, విదర్భ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే విధంగా షిర్డీ విమానాశ్రయంలో రూ.645 కోట్లు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నూతన భవనానికీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. షిర్డీకి వచ్చే పర్యాటకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అన్నీ పార్టీలు దూకుడు పెంచాయి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కొన్నేళ్లుగా మహాయుతి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రస్తావించారు.
మహారాష్ట్రలో మెట్రో విస్తరణ, విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సౌరశక్తి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి పలు పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అతిపెద్ద కంటైనర్ పోర్ట్ వధావన్ పోర్టుకు పునాది వేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని, కేంద్ర ప్రభుత్వం మరాఠీ భాషకు శాస్త్రీయ భాష హోదా కల్పించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు