నాల్గోతరం ష్టార్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ప్రయోగం

నాల్గోతరం ష్టార్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ప్రయోగం
భారత రక్షణ, పరిశోధనా సంస్థ డీఆర్డీవో మరో ఘనత సాధించింది.  నాలుగో తరానికి చెందిన  ‘అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ’ (వీఎస్‌హెచ్‌వోఆర్‌ఏడీఎస్‌)ను శనివారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో శనివారం ఈ పరీక్ష నిర్వహించారు. ఒకే రోజు మూడు క్షిపణుల పనితీరును పరిశీలించారు.
 
దేశీయంగా అభివృద్ధి చేసిన  విజయవంతంగా లక్ష్యాలను ఛేదించినట్టు డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు. మనుషులు సునాయాసంగా మోసుకెళ్లగలిగే ఈ గగనతల రక్షణ వ్యవస్థను డీఆర్‌డీవోలోని ల్యాబొరేటరీలు, భారత పారిశ్రామిక భాగస్వాములతో కలిసి హైదరాబాద్‌లోని రిసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ దేశీయంగా రూపొందించింది.
 
ఈ మిస్సైల్‌ శ్రతువుల విమానాలు, డ్రోన్స్‌ సహా ఇతర టార్గెట్స్‌ సహా తక్కువ ఎత్తులో ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని డీఆర్డీవో పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు విజయవంతంగా నిర్వహించగా తాజాగా మూడోసారి సైతం లక్ష్యాన్ని తాకింది. ఈ సందర్భంగా డీఆర్డీవో, ఆర్మీ, కంపెనీలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.
 
పోఖ్రాన్ నుంచి సాంకేతికత అధునాతన ఆయుధ వ్యవస్థ షార్ట్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ని విజయవంతంగా పరీక్షించారన్న ఆయన.. వైమానిక ముప్పునకు వ్యతిరేకంగా.. సాయుధ బలగాలకు మరింత సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. 
 
ష్టార్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్  డీఆర్డీవో, భారతీయ పరిశ్రమ భాగస్వాముల సహకారంతో రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. అంతకుముందు భారత్ ఈ ఏడాది మేలో స్వదేశీ రుద్రమ్-II ఎయిర్-టు గ్రౌండ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.