
కానీ, ముడా కుంభకోణంలో పూర్తి ఆధారాలతో సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయని, ఆయన అందులోంచి బయటపడటం దాదాపు అసాధ్యమని పార్టీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధూనే సీఎంగా కొనసాగితే పార్టీ పరువు బజారున పడటం ఖాయమని, ఆయనను మార్చడం తప్ప పార్టీకి మరో ప్రత్యామ్నాయం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈ సందర్భంగా, ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ మంత్రులు పరమేశ్వర, మహదేవప్ప, ఎస్టీ వర్గానికి చెందిన సతీశ్ జార్ఖిహోళి ఇటీవల కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు ఉపముఖ్యమంత్రి శివకుమార్ కూడా పరమేశ్వర, జార్ఖిహోళితో విడివిడిగా సమావేశమై మంతనాలు జరిపారు.
ఒక వేళ కాంగ్రెస్ అధిష్ఠానం కనుక సిద్ధరామయ్యను మార్చాలనుకుంటే పరమేశ్వర, శివకుమార్ ఆ పదవికి పోటీపడేవారిలో ముందువరుసలో ఉంటారని ఒక సీనియర్ నేత తెలిపారు. కాగా, ఇప్పటికే పార్టీలోని ఆర్‌వీ దేశ్‌పాండే, ఎంబీ పాటిల్ లాంటి నేతలు సిద్ధరామయ్యపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాము ఆ పదవికి పోటీలో ఉన్నామంటూ ప్రకటించారు.
ప్రతి ఒక్కరూ సీఎం పదవిని కోరుకుంటారని, అందులో తప్పు లేదని, అధిష్ఠానం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి ఆయన ఆ పదవిలో ఉన్నారని పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. ఆయన ఐదేండ్లు సీఎంగా కొనసాగుతారా అన్నది అధిష్ఠానం ఇష్టమని, సిద్ధరామయ్య దిగిపోవాలంటూ పార్టీ నుంచి ఎలాంటి ఒత్తడి లేదని ఆయన తెలిపారు. కాగా, 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనే తాను సీఎం పదవికి పోటీ పడతానని జార్ఖిహోళి గతంలో ప్రకటించారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం