
ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు. 18వ విడుతలో 9.4కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేలకోట్లు జమ కానున్నాయి . ఈ సందర్భంగా నమో షెత్కారీ మహాసమ్మాన్ నిధి యోజన సైతం ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6వేల చొప్పున మూడు విడుతల్లో కిసాన్ సమ్మాన్ నిధిని నేరుగా రైతుల ఖాతాల్లో సమ చేస్తున్న విషయం తెలిసిందే. 18వ విడత నిధుల విడుదలతో పీఎం కిసాన్ కింద రైతులకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ.3.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులకు ఈ నిధులు పెట్టుబడి కోసం రైతులకు ఉపయోగపడతాయని ప్రధాని మోదీ చెప్పారు.
తొలి విడుతలో ఏప్రిల్ – జూలై మధ్య.. రెండో విడుతలో ఆగస్టు- నవంబర్.. మూడో విడుతలో డిసెంబర్-మార్చి మధ్య కేంద్రం సాయాన్ని రైతులకు అందిస్తున్నది. ఇక ఇప్పటి వరకు రూ.3.45 లక్షల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
కిసాన్ నిధులు సమ కాని రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని ఇందు కోసం అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కేంద్ర సూచించింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, మంత్రి సంజయ్ రాథోడ్ పాల్గొన్నారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు