
ఆ తర్వాత ఆయన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారాహి డిక్లరేషన్ బుక్‌తో ఆలయం వెలుపలకు పవన్ వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో ఆసక్తిగా భక్తులు గమనించారు.
కాలినడక సమయంలో తన వెంట ఉంచుకున్న డిక్లరేషన్ పుస్తకాన్ని స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు తీసుకెళ్లారు. వన్‌కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు చిన్న కుమార్తె పొలెనా అంజనా స్వామివారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్‌కల్యాణ్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు. ఐదున్నరకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం