దసరా కానుకగా అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులు

దసరా కానుకగా అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు దసరా కానుకగా పీఎం కిసాన్ 18వ విడత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ప్రకటన చేసింది. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు రైతులకు సాయం చేస్తోంది. 
 
2018 డిసెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2 వేలు చొప్పున మూడు వాయిదాలలో డబ్బు ఇస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 16వ విడతలో 93 మిలియన్ల మంది రైతులు రూ.2 వేలు చొప్పున పొందారు.
 
కాగా, 18వ విడత అందాలంటే రైతులు ఈకేవైసీ పూర్తి చేయాలి. రైతులు బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదో చెక్‌ చేసుకోవాలి. పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకున్న రైతులకు  ఈ కేవైసీ తప్పనిసరి.  ఓటీపీ ఆధారిత ఈకేవైసీ.. పీఎం కిసాన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లాలి. పీఎం కిసాన్ పథకంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. చేయడానికే ఈకేవైసీని తప్పనిసరి చేశారు.