28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

28న తిరుమలకు కాలినడకన వైఎస్‌ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఈనెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపారని పేర్కొంటూ వైసీపీ ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది.  తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామి వద్దకు మెట్ల మార్గాన వెళ్లనున్నారు.  తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం ఎక్స్‌ వేదిక ద్వారా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడుతున్నాని దుయ్యబట్టారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు.  ”కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారు. రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

”తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది” అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.