
ఇందులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆ ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు వైసిపి నేత కుక్కల విద్యాసాగర్‌ను ఏ1గా చేర్చారు. అతనితో పాటు మరికొందరు అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
తప్పుడు ఆధారాలను సృష్టించడం, నేరానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, తప్పుడు రికార్డులను తయారు చేయడం, తదితర ఆరోపణలపై ఐపీసీలోని 192, 211, 218, 220, 354 (డి), 467, 420, 469, 471 రెడ్ విత్ 120 (బి), ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ల కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే.
విద్యాసాగర్ కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లి, స్నేహితులు, న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేక్ అవుట్ ద్వారా లొకేషన్ను గుర్తించినట్లు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు.
గుజరాత్, హైదరాబాద్, దిల్లీతో పాటు పలు ప్రాంతాలు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు ముంబయి నటి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా పిటిషన్ దాఖలు చేశారు. కాంతిరాణా పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే ముంబయి నటి కేసులో కాంతిరాణా సస్పెండ్ అయిన విష
మరోవైపు ముంబయి నటి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా పిటిషన్ దాఖలు చేశారు. కాంతిరాణా పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు