కొన్ని రోజుల క్రితం కలకలం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని వివరించారు. పోలీసులు చార్జీషీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.
.
ఈ కేసుపై 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇందులో నటి హేమ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు పేర్కొన్నారు. పార్టీలో డ్రగ్‌ను హేమ సేవించినట్టు ఆధారాలు చూపిస్తూ.. మెడికల్ రిపోర్ట్స్‌ను ఛార్జ్ షీట్‌కు జోడించారు. రేవ్ పార్టీ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇక ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో నటి హేమను సస్పెండ్ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఆమె ఇటీవల కొన్ని మెడికల్ రిపోర్టులను చూపిస్తూ తాను డ్రగ్స్ సేవింపలేదని నిర్ధారణ అయిన్నట్లు చెప్పుకొచ్చారు.
మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు నిర్దారించారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హేమ వెళ్లలేదు. హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ.. తాను వెళ్లలేదంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసింది. కానీ పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకే విధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చారు.
More Stories
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయండి
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం దక్షిణ తెలంగాణకు శాపం!
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం