
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జన సంక్షేమ సమితి, సేవా భారతిల ఆధ్వర్యంలో 400 మంది కార్యకర్తలు, కుటుంబాలతో గత నాలుగైదు రోజులుగా విజయవాడలో బుడమేరు ముంపు ప్రాంతాలైన సింగ్ నగర్, ప్రకాష్ నగర్, పిఎన్టి కాలనీ, చిట్టి నగరు, కబేలా, పాల ఫ్యాక్టరీ ప్రాంతం, రాజరాజేశ్వరి పేట, పైపుల్ రోడ్డు, తోట వారి బజారు తదితర లోతట్టు ప్రాంతాలలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి వారి బాగోగులు కనుక్కొని వారికి భోజన ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, నీటి సీసాలు తదితర వస్తువులను ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసుకుని ఒక క్రమ పద్ధతిలో అత్యంత క్లిష్టమైన ప్రాంతాలకు చేరుకొని స్వయం సేవకులు సేవలందించారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్ల పైన పదార్థాలు తీసుకుని వెళ్లి కార్యకర్తలు నీటిలో దిగి ఇండ్లకు వెళ్ళగా పైనున్న వారు తాడుకు కట్టిన బకెట్ కిందకి వదిలి దాని సాయంతో కింద నుంచి పదార్థాలు స్వీకరించారు.
నాలుగు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని చుట్టూ నీరు ఉండి వెళ్తున్న సమయంలో ధైర్యంగా ఉన్నప్పటికీ, సాయంత్రం అయిందంటే గాఢాంధకారం రాత్రి ప్రవాహం పెరగవచ్చు పైకి రావచ్చు ఏమైనా జరగవచ్చని భయంతో రాత్రంతా ప్రాణభయంతో ఉన్నామని వారు వాపోయారు.
దీనికి తోడు పెంచుకుంటున్న ఆవులు గేదెలు కట్ట మీదే ప్రవహంలో మునిగి చనిపోయాయి. కొన్ని ప్రవాహాలలో కొట్టుకోటు ఉండడంతో అంతా దుర్గంధం వ్యాపించింది. ఎవరో తెలియని అనాధ శవాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. స్థానిక ప్రాంతాలలో చనిపోయినవారి అంత్యక్రియలు చేసే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటిలో ఉంచుకోలేక జల దహనం చేసిన శవాలో లేదా పై ప్రవాహంలో చిక్కుకుపోయి ప్రమాదవశాత్తు మరణించిన శవాలో తెలియదు. కానీ స్వయం సేవకులకు సుమారు 70 పైగా ఇలాంటివి కొట్టుకుపోతున్నవి కనిపించాయి. ఈ సేవలందిస్తున్న స్వయం సేవకులకు పాములు, మండ్రగబ్బలు, తేళ్లు వంటి ప్రమాదకర పరిస్థితులలో సేవలు అందించారు.
ఈ మూడు రోజులలో వరద ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న సత్యనారాయణపురంలోని శిశువిద్య మందిరంలో వేడివేడిగా తయారుచేసిన ఆహార పదార్థాలను స్థానిక కుటుంబాల స్వయం సేవకులు ప్యాకింగ్ చేసి ఒక ప్రవాహం లాగా అందించిన వాటిని మరింత సమీపాన్ని చేర్చుటకు వాహనాలలో తీసుకొని వెళ్లి సుమారు 20వేల ఆహార పొట్లాలు, మంచినీటి సీసాలు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, పది వేల ఇండ్లకు వెళ్లి అందించారు.
బుధవారం వరకు 50,000 ఆహార ప్యాకెట్లు, 75,000 వాటర్ బాటిళ్లు, 4,500 మిల్క్ ప్యాకెట్లు, 7,500 బిస్కెట్ ప్యాకెట్లను సింగ్ నగర్, దేవి నగర్, రామకృష్ణ పురం, వోంబే కాలనీ, ప్రభ కాలనీ, నున్న, అమలి స్కూల్ షెల్టర్, వన్ టౌన్, ఎస్వివి స్కూల్ షెల్టర్, రాజీవ్ నగర్, జక్కంపూడి కాలనీ, కబేలా, ఊర్మిళా నగర్, ఆర్ఆర్ పేట, పాత ఆర్ టి టి నగర్, చిట్టి నగర్, సాయి రామ్ థియేటర్, తోట వారి వీధి ఏరియాలలో పంపిణీ చేశారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన