
గిరిజన మహిళ ను చంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన మహిళ కు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించాలని డిమాండ్ చేసింది.
పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సునీత రామ్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులపై దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఓట్ల కోసం పాకులాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
చట్ట వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లింలను అక్కడి నుంచి తరిమివేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ గిరిజన మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దుర్మార్గులపై కఠిన శిక్షలు విధించాలని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చొరవ తీసుకొని ఈ విషయంపై బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.
అత్యాచారానికి యత్నించిన ముస్లిం యువకులను బహిరంగంగా శిక్షించాలని, మరోసారి హిందూ మహిళల వైపు చూడకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా చనిపోయిందని భావించి, ఆమెపై ఉన్న నగలను దొంగలించి వెళ్లిపోవడం అత్యంత హేయమని పేర్కొన్నారు. జైనురు తగలబడుతున్నప్పటికీ స్థానిక పోలీసు యంత్రాంగం నిందితులకే వత్తాసు పలికే విధంగా వ్యవహరించాయని ఆరోపించారు.
స్థానిక డిఎస్పి నీ వెంటనే సస్పెండ్ చేయాలని పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. 1/ 70 యాక్ట్ అమల్లో ఉన్న ప్రాంతంలో గిరిజనుల ఆస్తులను ముస్లింలు ఎలా కొంటున్నారని, చట్టం దానిని ఏ విధంగా ఆమోదిస్తుందని నేతలు ప్రశ్నించారు. ఆదిలాబాద్ అడవుల్లో నిరంతరం హిందువులను టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం స్పందించకపోవడం లేదని ఆరోపించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి