
ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ ఆడబిడ్డపై ఆగస్టు 31న జరిగిన అత్యాచారం, హత్యయత్నంకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా గాంధీ హాస్పిటల్ లో ఉన్న బాధిత మహిళను పరామర్శించడానికి వెళ్లిన శిల్పారెడ్డి బాధిత కుటుంబంతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు
మహిళ పై జరిగింది హత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పినా మంత్రి సీతక్క ఈ కేసుని పక్కతోవ పట్టించే తీరును నిరసిస్తూ మహిళకి న్యాయం జరగాలని గాంధి హాస్పిటల్ ముందు ఆమె బైటాయించారు.బాధిత మహిళా కుటుంబానికి జరిగిన అన్యాయంను పక్కదోవ పట్టించడానికి వచ్చిన మంత్రి సీతక్కను ఈ విషయమై ఆమె నిలదీశారు.
ఈ సంఘటనను అత్యాచారం మరియు, హత్య యత్నంగానే చూడాలని, మతపరమైన అంశంగా చిత్రికరించవద్దని సూటిగా మంత్రిని శిల్పారెడ్డి హెచ్చరించారు. వెంటనే నిందితుడికి ఎస్సి, ఎస్టీ ఆధ్యిఆచార నిరోధక చట్టం, అత్యాచారం, హత్యయత్నం కేసులు పెట్టి ఉరిశిక్ష విధించి బాధిత మహిళకి న్యాయం చేకూర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రాష్ట్ర మహిళా మోర్చా తరుపున ముందు ముందు చెపట్టబోయే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని శిల్పారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించి, నిందితులపై కఠిన చర్య తీసుకొనేందుకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డా. శిల్ప రెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
కాగా, షేక్ మగ్దూం అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసాడని బాధితురాలు స్పష్టంగా తెలిపినా పోలీసులు పట్టింపులేకుండా వ్యవహరించడం పట్ల ఆదిలాబాద్ బిజెపి ఎంపీ నగేష్ అంతకు ముందు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి మహిళా మోర్చా నాయకులు బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నప్పటికీ అత్యాచారం జరగలేదని రాష్త్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నిందుతుడిపైన కఠిన చర్యలు తీసుకొని, బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ ఆదివాసులకు మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి