నటి కాదంబరీ కేసు ద‌ర్యాప్తు అధికారిగా ఎసిపి స్ర‌వంతి

నటి కాదంబరీ కేసు ద‌ర్యాప్తు అధికారిగా ఎసిపి స్ర‌వంతి

బాలీవుడ్ నటి కాదంబరీ జిత్వానీ అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఐపీఎస్‌ల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సర్కార్‌ నిర్ణయం అ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది.

కాదంబరి జెత్వానీ గురువారం రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్‌కు చెరుకున్నారు. అక్కడి నుంచి ఏపీ పోలీసులు రక్షణతో ఆమెను విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వైసీపీ టార్చర్ వ్యవహారానికి సంబంధించి కాదంబరి జెత్వానీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను తీసుకొస్తున్నారు.

నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు  వెల్లడించారు. డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీశారని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. 

 సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ విజ‌య‌వాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టికే జిత్వానీ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని, ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. దర్యాప్తు అధికారిగా ఉన్న డాక్టర్ స్రవంతి రాయ్‌తో కూడా జెత్వానీ ఫోన్‌లో మాట్లాడారు. కేసు వివరాలను, సాక్ష్యాలను, అప్పట్లో చేసిన చిత్ర హింసలకు సంబంధించిన వివరాలను తమకు వివరించాలని స్రవంతి రాయ్ కోరారు.

 ‘‘స్రవంతి రాయ్ అనే అధికారిని విచారణ కోసం నియమించాం. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుంటాం. చీటింగ్ కేసులో నటితో పాటు కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాం. ఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది. నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుంది. మొత్తం ఈ కేసులో అన్ని కోణాల్లో సాంకేతికతతో ఆధారాలు సేకరిస్తాం. నివేదిక రూపంలో డీజీపీకి అందచేస్తాం. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారు’’ అని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.