
తెలంగాణ రాష్ట్రంలోని లో గిరిజనులపై గుడుంబా నిర్మూలన పేరుతో దాడులు వెంటనే నిలిపివేయాలని జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు. గిరిజనులపై తండాలలో జరుగుతున్న ఎక్సైజ్ దాడులు, ఉద్యోగస్తుల సమస్యల పై బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా ఫిర్యాదు మేరకు అధికారులతో హైదరాబాద్ లో సమావేశం జరిపారు.
ఎక్సైజ్ ఉద్యోగుల్లో ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, గిరిజనుల మీద పెట్టిన పిడియాక్టు కేసులు వెంటనే ఎత్తివేయాలని, రిహాబిలిటేషన్ ఉన్న గిరిజనులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని, బ్రీజ్ కేసు కింద లక్ష రూపాయల జరిమానా వసూలు వెంటనే ఆపాలని, ఎక్సైజ్ ఎక్సైజ్ మద్యం టెండర్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కేటాయించాలని, పిసా చట్టం వెంటనే అమలు చేయాలని, తండాలలో లైసెన్సు లేకుండా నడుపుతున్న కల్లు కాంపౌండ్లు రద్దు చేయాలని, తండాలలో బెల్ట్ షాపులోని వెంటనే వెత్తివేసి చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు హుస్సేన్ నాయక్ ఆదేశించారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎస్టీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్, ఎక్సైజ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిజ్వి, తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ , తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి హాజరయ్యారు
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత