
శతాబ్దాలుగా స్థిర నివాసం లేకుండా సనాతన ధర్మ ప్రచారం (తోలు బొమ్మలాట వంటి కళల ద్వారా) చేస్తున్న వారు సంచార తెగల ప్రజలు.దేశ రక్షణ కొరకు బలిదానాలు చేసిన వారు డి ఎన్ టి తెగల ప్రజలు. వీరి జనాభా సుమారు 12 కోట్లు ఉంటుంది. భారత రాజ్యాంగం ద్వారా,స్వతంత్ర భారతంలో వీరి అభివృద్ధినీ ఎవరూ పట్టించుకోలేదు. ఆటల్ జీ ప్రధానీగా ఉన్న సమయంలో దాదా ఇదాటే కమీషన్ నివేదిక మేరకు మహారాష్ట్రలో వీరికి రిజర్వేషన్లు కల్పించారు.
మోదీ ప్రభుత్వంలో డి ఎన్ టి, సంచార తెగల అభివృద్ధి మండలి జాతీయ స్థాయిలో ఏర్పడింది. సామాజిక సమరసత వేదిక, ఆర్.ఎస్.ఎస్.ల సహాయంతో 1992లో మహారాష్ట్రలో ఈ ప్రజల కొరకు ఆవాస పాఠశాల ప్రారంభం అయింది. 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో సేవా భారతి సహకారంతో ఒక ఆవాసం ప్రారంభం అయింది.
తాజాగా బలహీన వర్గాలకు చెందిన, ఆర్థికంగా సామాన్యులైన శ్రీమతి లావణ్య, కిషోర్ దంపతులు జీవితాంతం కూడబెట్టిన ధనంతో తమ కొరకు కట్టుకున్న భవనాన్ని సంచార తెగల విద్యార్థుల వసతి కొరకు ఇచ్చారు.
ఎంత ఆశ్చర్యం! పేద ప్రజల పేరున డబ్బు దోచుకునే వారు, పదవులు సంపాదించుకుని ఈ పేద ప్రజలను పట్టించుకోని వారు కొల్లలుగా ఉన్న సమయంలో లావణ్య, కిషోర్ దంపతులు ఈ సమర్పణ చేయడం ఎంతో స్ఫూర్తి దాయకం. వీరికి సంచార తెగల జాతీయ సమావేశంలో 18 ఆగస్టున ఆర్.ఎస్.ఎస్.కార్యాలయంలో జాతీయ నాయకులు సన్మానం చేశారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు