
వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. సోమవారం సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేర్కొంది.
ఆదివారం ఉదయమే కానవచ్చిన ఈ సూపర్ మూన్ బుధవారం (21) వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడవచ్చునని నాసా సూచించింది. అయితే, మంగళవారం (20) ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా తెలిపింది. ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా, భారత్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కనిపిస్తుంది.
అయితే, ఈ సారి మాత్రం సూపర్ మూన్, బ్లూ మూన్ కలయికలో సూపర్ బ్లూ మూన్ దర్శనం ఇవ్వబోతున్నది. పౌర్ణమి గడియల్లో చందమామ 90శాతం భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. దాంతో సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతం ఉండడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు.
నాలుగు పౌర్ణమిలలో మూడో పౌర్ణమి రోజున బ్లూ మూన్ ఏర్పడుతుంది. అయితే, బ్లూ మూన్ అంటే నీలం రంగులో మాత్రం కనిపించదు. కానీ, సాధారణంగా బ్లూ మూన్ అని పిలుస్తుంటారు. సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ ఒకేసారి రావడం అరుదుగా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సారి సూపర్ బ్లూ మూన్ అనేది భారతీయులకు ఎంతో ముఖ్యమైన రాఖీ పండుగ రోజున రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది.
సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలీ అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దానిని సూపర్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడు.
2024లో వరుసగా సూపర్ మూన్‌లు ఆవిష్కరం కాబోతున్నాయి. ఇందులో రాఖీ పండుగ రోజున ఒకటి దర్శనం ఇవ్వనుండగా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ సూపర్ మూన్‌లో కనిపించనున్నాయి. పౌర్ణమి రోజు 25శాతం సూపర్ మూన్‌లు ఏర్పడితే 3శాతం మాత్రమే బ్లూ మూన్స్ ఆవిష్కృతమవుతాయి.
ఇక ఈ రెండింటి కలయికలో ఇంకా అరుదుగా వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండింటి కలయికలో 2037 సంవత్సరంలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని అంచనా. నాసా ప్రకారం అప్పుడప్పడు పొగ, ధూళి తదితర చిన్న చిన్న కణాలు కాంతి ఎరుపు తరంగ ధైర్ఘ్యాలను చెదరగొడుతుంటాయి. దాంతో చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన