
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు నిరాశ తప్పలేదు. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ చేసిన అప్పీల్‌ను స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ తిరస్కరించింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరింది. అయితే, ఫైనల్‌కు ముందు నిర్ణీత పరిమితి కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు తేలడంతో అనర్హురాలిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, తనకు సెల్వర్ మెడల్ ఇవ్వాలంటూ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌కు అప్పీల్ చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన కాస్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, ఈ నెల 16 నిర్ణయం ప్రకటిస్తామన్న కాస్. అనూహ్యంగా బుధవారమే నిర్ణయాన్ని వెలువరించింది. కాస్ నిర్ణయంతో ఒలింపిక్‌లో పతకం సాధించాలన్న వినేశ్ కల చెదిరిపోయినట్లయ్యింది.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫోగట్ చేసిన అప్పీల్‌ను ట్రిబ్యునల్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించడంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష నిరాశ వ్యక్తం చేశారు.
మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్ ఈ వెంట్‌లో గత మంగళవారం జపాన్‌కు చెందిన యుయి సుసాకిపై విజయంతో సహా మూడు విజయాలతో వినేశ్ ఫైనల్‌కు చేంది. ఫైనల్‌కు ముందు వంద గ్రాముల అధిక బరువు కారణంగా అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో పోటీ పడాల్సి ఉండగా అనూహ్యంగా అనర్హత వేటు వేపడింది.
స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుకు పెట్టుకున్న అప్పీల్‌లో క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిసి తనకు జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేశ్ విజ్ఞప్తి చేసింది. గుజ్మాన్ లోపెజ్ సెమీ ఫైనల్స్‌లో వినేష్ చేతిలో ఓటమిపాలైంది. వినేశ్‌పై అనర్హతతో గుజ్మాన్ ఫైనల్‌కు వెళ్లింది. అనర్హత వేటు పడిన తర్వాత రెజ్లింగ్‌కు వినేశ్ రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఆటను కొనసాగించే శక్తి తనకు లేదని పేర్కొంది. ఆ తర్వాత వినేశ్ యావత్ దేశం మద్దతుగా నిలిచింది.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి