రైతులకు అవసరమైన సమయాల్లో అతి తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా రుణాలు పొందవచ్చు. బయట ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు సహాయపడతాయి. పశువుల పెంపకందారులు ఈ కార్డును డెబిట్ కార్డుగా కూడా ఉపయోగించవచ్చు. అలాగే రైతులు తమ భూమి లేదా ఇతర ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక గేదెకు రూ.60,000, ఒక ఆవుకు రూ.40,000, ఒక కోడికి రూ.720 మరియు ఒక గొర్రె లేదా మేకకు రూ.4000 రుణం అందిస్తుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పశు కిసాన్ క్రెడిట్ కార్డుదారుడికి 4 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుంది.
పశువుల పెంపకందారులు ఆరు వాయిదాల్లో రుణం మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని రైతులు ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు రైతులకు 7 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తుంటాయి. అయితే పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు ప్రభుత్వం 3 శాతం రాయితీ లభిస్తుంది. రైతులు తీసుకున్న రుణంపై 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

More Stories
భారత్‌పై సుంకాలు తగ్గించబోతున్నాం
అజిత్ పవార్ కుమారుడి భూమి రిజిస్ట్రేషన్ రద్దు!
కేవైసీ ఫోర్జరీ చేసి టీఎంసీ ఎంపీకి 56 లక్షలు టోకరా