
జమ్మూకశ్మీర్ అనంత్‌నగర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సైనికుడితో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కోకెర్‌నాగ్‌లోని అహ్లాన్ గగుర్ముండు ప్రాంతంలో ఉగ్రవాదులు సంచారిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని చేరుకొని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని.. వారిని సైనం చుట్టుముట్టినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు.
ఇంతకు ముందు 6న బసంత్‌గఢ్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. రెండు గంటలపాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య సాయంత్రం వరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన పారాట్రూపర్లు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను పట్టుకునేందుకు.. అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కోకెర్‌నాగ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
ఆ సమయంలో ఆపరేషన్‌లో పాల్గొన్న కమాండింగ్ ఆఫీసర్, మేజర్, డీఎస్పీ అమరులు అయ్యారు. దాదాపు ఏడాది తర్వాత ఇదే ప్రాంతంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అహ్లాన్ గాడోల్ అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు ఈ ప్రాంతానికి సైన్యాన్ని మోహరించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్