
ప్రజా జీవితంలో ఉండే నాయకులు హుందాగా వ్యవహరించాలని, అయితే కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఏపీ అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారికి ఇటీవల ఎన్నికలలో ఓట్లు వేయకుండా ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన గుర్తు చేశారు.
బాపట్ల జిల్లా కారంచేడులో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వారు హుందాగా ఉండాలని, మాటలు సక్రమంగా రావాలని సూచించారు. కష్టపడి ఇష్టంగా పనిచేసే వ్యక్తులే రాజకీయాల్లోకి రావాలని సలహానిచ్చారు. కానీ కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలు ఓట్లు వేయకుండా ప్రతిపక్షాల్లో కూర్చోబెడుతున్నారని వ్యాఖ్యానించారు.
రాజకీయ నాయకులకు సానుకూల దృక్పథం ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని సానుకూలంగా స్పందించాలని సూచించారు. ప్రజా నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు సమస్యలను చెప్పుకోగలరని తెలిపారు.
కానీ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా చట్టసభల్లో హుందాగా నడుచుకోవాల్సిందిపోయి గుండీలు చింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి ఇష్టంగా పనిచేసే వ్యక్తులే రాజకీయాల్లోకి రావాలని సలహానిచ్చారు. కానీ కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
నిస్వార్థ సేవామూర్తి మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి. దాతృత్వం, మానవత్వం, పాలన దక్షత, స్నేహ సౌరభం కలిగిన వ్యక్తి కుప్పుస్వామి అని వెంకయ్య నాయుడు కొనియాడారు. అన్నదానం కన్నా విద్యా దానం గొప్పదని చెప్పిన మహనీయుడు అంటూ అలాంటి వారి గురించి నేటి తరాలకు తెలియాలని చెప్పారు. ప్రభుత్వాలు సైతం పల్లెల వైపు చూడని సమయంలో గ్రామాల అభివృద్ధికి వారు కృషి చేశారని తెలిపారు.
More Stories
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు
రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని