
* హాకీ జట్టు విజయంపై రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
విశ్వ క్రీడల్లో భారత పురుషుల హకీ జట్టు అద్వితీయ విజయంతో కాంస్యం (కొల్లగొట్టింది. పసిడి వేటలో తడబడిన టీమిండియా కంచు పోరులో మాత్రం జూలు విదిల్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డబుల్ గోల్‌తో స్పెయిన్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి నాలుగో మెడల్ అందించడంతో పాటు 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కంచు మోత మోగించింది.
ఒకదశలో 1-0తో వెనకబడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుస గోల్స్‌తో ప్రత్యర్థికి భారత జట్టు దడపుట్టించింది. ఆఖర్లో స్పెయిన్ రెండు గోల్ ప్రయత్నాలను అడ్డుకొని టీమిండియా చిరస్మరణీయ విజయంతో కాంస్యాన్ని ముద్దాడింది. ఆఖరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కు ఘనమైన వీడ్కోలు పలికింది.
ఒకానొక సమయంలో ప్రపంచ హాకీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ ఒలింపిక్స్‌లో అదరగొట్టింది. ధ్యాన్ చంద్ హయాంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ పసిడి పతకాలను కొల్లగొట్టింది. 1968లో మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్‌లో, ఆ తర్వాత 1972లో మ్యూనిచ్ (జర్మనీ) ఆతిథ్యమిచ్చిన విశ్వ క్రీడల్లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఇప్పుడు మళ్లీ 52 ఏండ్లకు వరుసగా రెండు కాంస్యాలతో భారత్ చరిత్ర సృష్టించింది. మొత్తంగా విశ్వ క్రీడల హాకీలో భారత జట్టు పతకాల సంఖ్యను 13కు చేర్చింది. దాంతో, యావత్ దేశం హాకీ యోధుల చిరస్మరణీయ విజయాన్నిసంబురంగా కీర్తిస్తోంది. ఆద్యంతం రఫ్పాడించిన భారత హాకీ జట్టు కాంస్యం మ్యాచ్‌లోనూ చెలేగింది.
“ఐదు దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో వరుసగా పతకాలు సాధించింది. భారత హాకీ పునరుజ్జీవానికి ఈ టీమ్ చేసిన కృషి ప్రశంసనీయం. నిలకడ, నైపుణ్యం, సమన్వయం, పోరాటం ద్వారా క్రీడాకారులు చూపిన ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకం.” అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందనలు తెలిపారు.
‘భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇది మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం. నైపుణ్యం, పట్టుదలకు స్ఫూర్తి ఈ విజయం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన చేశారు. భారత హాకీ బృందం స్ఫూర్తిని చాటింది. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉంది. ఈ విజయానికి మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. క్రీడాకారులందరికీ అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
మరో వైపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ క్రీడా పాలసీ మేరకు పంజాబ్‌కు చెందిన ప్రతి క్రీడాకారుడికి రూ.50 లక్షలు ఇస్తామని చెప్పారు. భారత జట్టు విజయంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సంతోషం వ్యక్తం చేశారు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని చూడడం సంతోషంగా ఉందని తెలిపారు. `ప్రతిభావంతులైన హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని అందించింది. ఇదో చారిత్రక మైలురాయి’ అని పేర్కొన్నారు.
తొలి అర్ధ భాగంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. కాసేపట్లో తొలి అర్ధ భాగం ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అంతే.. 1-1తో స్కోర్ సమం అయింది.
అనంతరం రెండో అర్ధభాగం మొదలవ్వగానే భారత సారథి మళ్లీ పెనాల్టీ కార్నర్‌ను స్పెయిన్ గోల్ కీపర్ కళ్లుగప్పి గోల్స్ కొట్టాడు. దాంతో, భారత జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత డిఫెండర్లు స్పెయిన్ ఫార్వర్డ్స్‌ను సమర్ధంగా నిలువరించారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది.
కానీ, భారత వాల్ శ్రీజేష్ అద్భుతంగా బంతిని అడ్డుకున్నాడు. దాంతో, టీమిండియా వరుసగా రెండో పర్యాయం కూడా కాంస్యాన్ని నిలబెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4తో గెలుపొందిన భారత్ కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. అయితే.. 44 ఏండ్ల తర్వాత స్వర్ణాన్ని ముద్దాడాలనుకున్న టీమిండియా కలకు జర్మనీ చెక్ పెట్టింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు 47 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు వరుసగా 2 ఒలింపిక్స్‌లో పతకాలను దక్కించుకుంది. మొత్తంగా ఒలింపిక్స్లో హాకీ జట్టుకు ఇది 13వ పతకం కావడం విశేషం.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు