
స్టార్ షూటర్ మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ ముగింపు సంబరాల్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మానూ భాకర్ తాజా గేమ్స్‌లో రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. వ్యక్తిగత 10మీటర్ల ఎయిర్ పిస్తోల్, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్నది.
మనూ భాకర్‌ను ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేశామని, క్రీడల్లో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిందని, పతాకధారిణిగా ఆమె అర్హురాలు అని ఒలింపిక్ సంఘం అధికారి ఒకరు తెలిపారు. భారత పతాకధారిణిగా ఉండడం గర్వంగా ఫీలవుతున్నట్లు షూటర్ మనూ తెలిపింది. తమ బృందంలో జెండాను ఆవిష్కరించే అర్హులు ఎంతో మంది ఉన్నారని, కానీ తనను కోరడాన్ని గొప్ప మర్యాదగా భావిస్తానని ఆమె చెప్పారు.
అయితే క్లోజింగ్ సెర్మనీలో జెండాను పట్టుకునే మగ అథ్లెట్ ఎవరన్నది ఇంకా అధికారులు ప్రకటించలేదు. మనూ భాకర్‌తో పాటు ఈ క్రీడల్లో షూటర్ స్వప్నిల్‌కు కాంస్య పతకం దక్కింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు అదరగొట్టారు. వ్యక్తిగత ఈవెంట్‌లో నిరాశపరిచిన మనికా బత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్ లు టీమ్‌గా హిట్ కొట్టారు. పతకం ఆశలు రేపుతూ ఈ త్రయం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన 16వ రౌండ్‌లో శ్రీజ, బత్రా, అర్చన బృందం రొమేనియా జట్టును చిత్తు చేసింది.
తొలుత అర్చనా కామత్ రొమేనియా స్టార్ అడినా డియాకొనుకు చెక్ పెట్టింది. అనంతరం శ్రీజ సైతం పట్టుదలగా ఆడి ఎలిజబెట సమరను ఓడించింది. దాంతో, భారత జట్టు 3-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మనికా బత్రా వరుసగా రెండు గేమ్‌లు గెలిచింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్.. బ్రాంజ్ మెడల్ కోసం పోటీపడనున్నాడు. మహిళల 68 కేజీల విభాగంలో రెజ్లర్ నిషా దహియా తన క్యాంపేన్ ఇవాళ స్టార్ట్ చేయనున్నది. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా .. ఆగస్టు ఆరో తేదీ నుంచి తన క్యాంపేన్ ప్రారంభిస్తారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి