బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ సిద్ధం .. 5జి పక్రియ ప్రారంభం

బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ సిద్ధం .. 5జి పక్రియ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు.  ఆత్మ నిర్బర్ భారత్ ఇన్షియేటివ్ కింద స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో బీఎస్ఎన్ఎల్ ద్వారా 4జీ సేవలు అందరికీ లభిస్తాయని చెప్పారు.

‘రిలయన్స్ జియో, భారత్ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 4జీ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి తెస్తున్నప్పుడు బీఎస్ఎన్ఎల్ లో 4జీ నెట్వర్క్ ఎందుకు తేవడం లేదని పలువురు ప్రశ్నించారు. చైనా, ఏ ఇతర విదేశీ కంపెనీ పరికరాలు వాడకుండా దేశీయంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నెట్ వర్క్ అభివృద్ధి చేయాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు’ అని సింధియా పేర్కొన్నారు.

అందుకే స్వదేశీ పరిజ్ఞానంతోనే 4జీ నెట్వర్క్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.  తేజాస్ నెట్ వర్క్, సీ-డాల్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా టవర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టినట్లు సింధియా తెలిపారు. అక్టోబర్ కల్లా 80 వేలు, మరో 21 వేలు వచ్చే ఏడాది మార్చి కల్లా ఇన్ స్టాల్ చేస్తామని తెలిపారు.

 2025 మార్చి కల్లా లక్ష ‘4జీ నెట్ వర్క్’ టవర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఇంటర్నెట్ ద్వారా వేగంగా డేటా డౌన్ లోడ్, వాచింగ్ టెలివిజన్ తేలికవుతుందని చెప్పారు. 4జీ నెట్వర్క్ పరిధిలోనూ 5జీ సేవలు వినియోగించుకోవచ్చునని తెలిపారు. 5జీ సర్వీసుల కోసం టవర్లలో కొన్ని మార్పులు చేపట్టాల్సి ఉందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.