
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 25న పొడిగించిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఆగస్టు 8న జరుగనున్నది.
తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తిహార్ జైలులోనే కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. సీఎం కేజ్రీవాల్‌తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నేతలకు జూలై 31 వరకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 31 వరకు కస్టడీని పొడిగించింది.
ఇంతకు ముందు జూలై 12న సీబీఐ విచారిస్తున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరుచగా.. కస్టడీని ఈ నెలాఖరు వరకు పొడిగించారు.
మరోవంక, ఆరోపిత ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును సోమవారం రిజర్వ్ చేసింది. ఆప్ నేత, సిబిఐ తరఫున న్యాయవాదులు చేసిన వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పును రిజర్వ్ చేశారు.
ఈ కేసులో కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సిబిఐ వ్యతిరేకించింది. ఎక్సైజ్ కుంభకోణంలో ఆయన ‘సూత్రధారి’ అని, విడుదల చేసినట్లయితే ఆయన సాక్షులను ప్రభావితం చేయవచ్చునని సిబిఐ వాదించింది. ‘ఆయన అరెస్టు జరగకపోయి ఉంటే దర్యాప్తు పూర్తి అయి ఉండేది కాదు. ఒక నెలలోపే మేము చార్జిషీట్ దాఖలు చేశాం’ అని సిబిఐ న్యాయవాది డిపి సింగ్ తెలిపారు.
అంతకుముందు కేజ్రీపైన, ఆప్ ఎంఎల్‌ఎ దుర్గేశ్ పాఠక్ సహా మరి ఐడుగురిపై సిబిఐ విచారణ కోర్టులో తమ తుది చార్జిషీట్ దాఖలు చేసింది. కేజ్రీ అరెస్టు జైలులో నుంచి బయటకు రాకుండా చూసేందుకు జరిపిన ‘బీమా అరెస్టు’ అని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ