కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కొత్త హామీలు ఏవీ యివ్వలేదు.. విభజన హామీలే!

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కొత్త హామీలు ఏవీ యివ్వలేదు.. విభజన హామీలే!

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక అమద్దతుదారునిగా మారడంతో కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుచితంగా ఏవేవో హామీలు ఇచ్చినట్లు కొన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తుండటం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఆమె కొత్తగా ఎటువంటి వాగ్దానాలు చేయనేలేదని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను మాత్రమే అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. 

విభజన సమయంలో ఆంధ్ర తెలంగాణకు తలసరి ఆదాయం రూ. 30 వేల తేడా ఉందని, గడిచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన్నమైన పరిస్థితికి ఏపీ పడిపోయిందని, తలసరి ఆదాయం పడిపోయిందని చెబుతూ ఇటువంటప్పుడు ఆర్ధిక మంత్రి ఇచ్చిన హామీలను రాజకీయం చేయడం తగదని ఆయన ప్రతిపక్షాలకు హితవు చెప్పారు.

అమరావతి పోలవరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రత్యేక హోదా బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సహాయం చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ‘‘పోలవరం, అమరావతి నాశనం అయిపోయింది. ఇండస్ట్రీలు పారిపోయాయి. ప్రజలు ఎన్డీఏపై నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు. రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఏపీ పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నాం” అని తెలిపారు.

“జగన్ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు ఎన్డీఏకి చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత మాకు ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలే అడుగుతున్నాం. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. కావాలని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. స్వచ్ఛ భారత్, జల జీవన మిషన్‌లో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెనుకబడి ఉంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయి. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్లు కొందరు రాజకీయం చేస్తున్నారు. చట్టం రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయే. విభజన కంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది” అంటూ విమర్శించారు. స్

పోలవరం, అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపాను. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచాము. ఏపీ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని అందజేశాను. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరాను’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంపై హాజరైన అనంతరం అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ను కలిసి పోలవరం ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి చర్చించారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరుతూ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.