
బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హెన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా) రెండో, వనిందు హసరంగ (శ్రీలంక) మూడో ర్యాంక్‌లో నిలిచారు. భారత్ నుంచి టాప్10లో ఎవరికీ చోటు దక్కలేదు. అక్షర్ పటేల్ తాజా ర్యాంకింగ్స్‌లో 4 స్థానాలు కోల్పోయి 13వ స్థానంలో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 4 ర్యాంక్‌లు కోల్పోయి 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
కాగా, టీమ్ విభాగంలో మాత్రం భారత్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. విశ్వవిజేతగా ఉన్న టీమిండియా 266 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో, ఇంగ్లండ్ మూడో, వెస్టిండీస్ నాలుగో, సౌతాఫ్రికా ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.
ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచ టాప్ టీ20 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఒక స్థానం మెరుగుపడి మూడో స్థానానికి చేరాడు. ఇక ఆల్ రౌండ్ల ర్యాకింగ్స్‌లో శ్రీలంక ఆటగాడు హసరంగ అగ్రస్థానంలో ఉండగా.. హర్దిక్ పాండ్యా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక, వుమెన్స్ టీ20 ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ షెఫాలీ వర్మ ర్యాంకులు మరింత మెరుగయ్యాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ 12వ స్థానానికి, షెఫాలీ వర్మ 15వ స్థానానికి చేరుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ 613 రేటింగ్ పాయింట్లు ఉండగా మూడు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నది.
షెఫాలీ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 605 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానానికి చేరింది. న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్, ఇంగ్లండ్‌కు చెందిన డానీ వ్యాట్‌లతో కలిసి షెఫాలీ 15వ స్థానంలో ఉన్నది. ఇక టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన ఐదో స్థానంలో కొనసాగుతున్నది. టాప్-10లో ర్యాంకుల్లో కేవలం టీమిండియా నుంచి క్రీడాకారిణుల్లో స్మృతి మంధాన ఉన్నది.
బౌలర్ల జాబితాలో వెటరన్ దీప్తి శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నది. రాధా యాదవ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి, పూజా వస్త్రాకర్ ఆరు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌కు, శ్రేయాంక పాటిల్ 9 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నది.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు