
జూలై 18వ తేదీన ఉదయం 9.51 నిమిషాల నుంచి 12.15 నిమిషాల మధ్య కాలంలో రత్న భండార్ తాళాలను ఓపెన్ చేస్తామని, అక్కడ ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక రూమ్‌కు తరలిస్తామని, పురావాస్తుశాఖ అధికారులు తమకు సహకరిస్తారని, ఈ ఈవెంట్‌ను మొత్తాన్ని వీడియోగ్రాఫ్ చేస్తామని జస్టిస్ రాథ్ తెలిపారు.
ఆభరణాలన్నిటినీ తరలించాకే పురావస్తుశాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్‌ఐ అధికారులు, రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని జస్టిస్ రథ్ వివరించారు. రహస్యగదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తిచేశారు.
ఆభరణాలను ఉంచే తాత్కాలిక ప్రదేశం వద్ద సీసీటీవీలను అమర్చనున్నట్లు చెప్పారు. అగ్ని రక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 18వ తేదీన ఆలయ నిర్వాహకులు విధించే నిబంధనలకు కట్టుబడి భక్తులు ఉండాలని ఎస్జేటీఏ తన అప్పీల్‌లో కోరింది.
లొపలి గదిలో బాక్సులు, అల్మిరాలను బృందం వీక్షించిందని. అయితే బహుదా యాత్ర, సునా బేషా ఈవెంట్ల నేపథ్యంలో బంగారు ఆభరణాలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించేందుకు నిరాకరించినట్లు జస్టిస్ రాథ్ తెలిపారు. బయటి గదిలో ఉన్న విలువైన వస్తువులను చాంగ్‌డా మేకప్ స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించినట్లు జస్టిస్ రాథ్ తెలిపారు. లోపలి గదికి చెందిన తాళం చెవులను ఏఎస్ఐకి ఇవ్వబోమని, నియమావళి ప్రకారమే తాళాలు తీయనున్నట్లు పథే తెలిపారు.
More Stories
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి