
వైకుంఠవాసన్, గోవిందరాజ రామస్వామి తిరుమల సర్వదర్శనం క్యూలైన్ తలుపులు తీస్తున్నట్లు ఫ్రాంక్ వీడియోలు తీశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్య మాల్లో వైరల్ కావడం, భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఆలయ గౌరవానికి భంగం కలిగించడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, శాంతిభద్రతల సమస్యకు కారణమవడం వంటి వాటిపై టిటిడి సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను తిరుమలకు తీసుకువచ్చాక పూర్తిగా విచారించి వీడియో చేయడానికి గల కారణాలు, అసలు ఉద్దేశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మరిన్ని సెక్షన్లు జోడిస్తామని తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల్ని ఆటపట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో వైరల్‌గా మారడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. పట్టిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో యువకులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ క్యూలైన్లలో ఎలా వచ్చిందనే సందేహాలు తలెత్తాయి. టీటీడీ భద్రతలో లోపాలను బయటపెట్టాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి ఉండదు.
తమిళనాడుకు చెందిన యూట్యూబర్ సిబ్బంది కళ్లుగప్పి మొబైల్‌ఫోన్ తీసుకెళ్లి ప్రాంక్ వీడియోని చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడు దానిని తన ఇన్‌స్ట్రాగాం పేజీలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. కాగా, తిరుమల క్యూలైన్‌లో ప్రాంక్ వీడియో భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తమిళ యూట్యూబర్ వీవీ వాసన్ క్షమాపణలు చెబుతూ శనివారం ఓ వీడియో విడుదల చేశారు.
తాము శ్రీవారి భక్తులమేనని, భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుండగా స్నేహితుడు చేసిన చర్యలు కొందరి మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ దీనికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. ఇకపై అలాంటి వీడియోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు