
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో పోలిక తీసుకొస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేత అమిత్ మాల్వియ విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై హింసకు రాహుల్ గాంధీ ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీపై దాడిని ప్రేరేపించేలా, హింసను సమర్ధించేలా పలుమార్లు రాహుల్ గాంధీ ప్రధానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. 2022లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని ఈ సందర్భంగా అమిత్ మాల్వియ ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగానే నాటి పంజాబ్ ప్రభుత్వం ప్రధాని భద్రతపై రాజీపడిందని చెప్పుకొచ్చారు.
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ను జో బిడెన్ విమర్శిస్తున్న విధంగానే రాహుల్ సహితం తరచూ మోదీని `నియంత’ వంటి పదాలతో విమర్శిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ట్రంప్ పై హత్యాయత్నం జరగనానే ఆయనను ఓ రాక్షసునిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటంతో ఆయన పట్ల విద్వేషం వ్యాప్తిచెందుందుకు దారితీసిందని ఆయన మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం.
ట్రంప్ ప్రత్యర్ధులు ఆయన కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో భారత్ లో మోదీ కారణంగా `రాజ్యాంగం ప్రమాదంలో పడింది’ అని ప్రచారం చేస్తున్నారని మాలవీయ గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికి అంతర్జాతీయ వామపక్ష దాడుల నుండి భారత ప్రజాస్వామ్యం నిలదొక్కుకుందని, మోదీ మూడోసారి తిరిగి ప్రధానిగా వచ్చారని ఆయన స్పష్టం చేశారు.
“అమెరికాలో వర్ణం మాదిరిగా భారత సమాజంలో చీలికలు తీసుకొచ్చేందుకు కులాన్ని ఓ అస్త్రంగా వాడుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థిని రాక్షసునిగా చిత్రీకరిస్తూ, నియంతగా పేర్కొనడం యాదృచ్చికంగా జరగడం లేదు. వాస్తవానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అంతర్జాతీయంగా విశేష ఆదరణ పొందుతున్న నేతను ప్రమాదకరమైన ఆలోచనలతో చేరుతున్న విదేశీ ధనంతో ఈ విధంగా చేస్తున్నారు” అంటూ బిజెపి ఐటి విభాగం అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భారతీయ ఎన్నికల్లో విదేశీ జోక్యం కోరుకుంటున్న రాహుల్ గాంధీ వరుసగా మూడోసారి విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు