
FBI has identified Thomas Matthew Crooks as the man who fired at Donald Trump during an election rally in Pennsylvania on July 13 | AFP/X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులకు తెగబడిన దుండగుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – ఎఫ్‌బీఐ గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్కుకు చెందిన 20 ఏళ్ల మాథ్యూ క్రూక్ అని అధికారులు ధృవీకరించారు. అయితే రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడిగానే పేరు నమోదు చేసుకున్న మాథ్యూ క్రూక్ గతంలో డెమోక్రటిక్ పార్టీకి అనుబంధంగా ఉండే ప్రోగ్రెసీవ్ టర్నవుట్ ప్రాజెక్టుకు విరాళం కూడా ఇచ్చారు.
ప్రస్తుతం మాథ్యూ క్రూక్ ఇంటివద్ద భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేసిన అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన 20 ఏళ్ల మాథ్యూ క్రూక్ ట్రంప్‌పై దాడి చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. అయితే అమెరికా ప్రభుత్వ ఓటింగ్ రికార్డు్ల్లో ఉన్న వివరా ప్రకారం మాథ్యూ క్రూక్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదాడు అని వెల్లడైంది.
రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడుగానే పేరు నమోదు చేసుకున్నట్లు తేల్చారు. అయితే 2021 లో మాథ్యూ క్రూక్ డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్ టర్న్‌వుట్ ప్రాజెక్టుకు 15 డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు గుర్తించారు. ఇక మాథ్యూ క్రూక్స్ నిందితుడు అని ఎఫ్‌బీఐ గుర్తించకముందే అతని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా మాథ్యూ క్రూక్ పేరును వెల్లడించాయి.
మరోవైపు.. ట్రంప్‌పై కాల్పులు జరపడానికి ముందు మాథ్యూ క్రూక్ విడుదల చేసినట్లుగా పేర్కొంటున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో తాను రిపబ్లికన్ పార్టీని, డొనాల్డ్ ట్రంప్‌ను ద్వేషిస్తున్నట్లు మాథ్యూ క్రూక్ చెప్పినట్లుగా ఉంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన స్టేజీకి 130 గజాల దూరం నుంచి మాథ్యూ క్రూక్ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. సభాస్థలికి ఎదురుగా ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కిన మాథ్యూ క్రూక్ ఈ కాల్పులు జరిపినట్లు స్పష్టం అవుతోంది. వెంటనే అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మాథ్యూ క్రూక్‌ను అతణ్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
ట్రంప్‌ను కాల్చి గాయపరిచేంతగా ఏఆర్శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో సాయుధుడు ఎలా సభావేదిక దగ్గర్లోకి చేరుకున్నాడని దానిపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. దుండగుడు ఏ ఆయుధం వాడాడు? ఇవన్నీ తెలుసుకునేపనిలో నిమగ్నమైంది. కాగా, సాయుధుడు హత్యకు గురయ్యే ముందు వేదికపైకి కాల్పులు జరపడం ఆశ్చర్యకరంగా ఉందని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ ఇన్ఛార్జ్ కెవిన్ రోజెక్ తెలిపారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్న నేపథ్యంలో ఆయనపై ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. అయితే దానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇక ట్రంప్‌పై కాల్పులకు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారికి ఎఫ్‌బీఐ విజ్ఞప్తి చేసింది.
డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటిస్తూ. దుండగుడు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు తెలిపింది. దుండగుడు కాల్పులు జరిపిన ప్రదేశంలో కొన్ని అనుమానిత ప్యాకేజీలను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రొజెక్ వెల్లడించారు. అవన్నీ పేలుడు పదార్థాలుగానే తాము భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు