
2027నాటికి ఈ స్పేస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధంచేసినట్టు కంపెనీ సీఈవో సిద్ధార్థ్ జేనా తెలిపారు. ఈ మేరకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో జట్టుకట్టనున్నట్టు తెలిపారు. తమ స్పేస్‌స్టేషన్‌లో ఏకకాలంలో 6-16 మంది ఉండొచ్చని చెప్పారు.
అంతరిక్షంలోని గ్రహ శకలాలు, రేడియేషన్ నుంచి రక్షించే అన్నిరకాల ఏర్పాట్లు ఐఎస్‌ఎస్‌కు దీటుగా తమ స్పేస్‌స్టేషన్‌లో ఉంటాయని పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌తో పోలిస్తే తమ స్టేషన్ ఎంతో చవకైనదని వెల్లడించారు. 2030లో ఐఎస్‌ఎస్ జీవితకాలం ముగియనున్నది. దీన్ని కూల్చేసే కాంట్రాక్ట్‌ను కూడా నాసా స్పేస్‌ఎక్స్‌కు ఇవ్వడం గమనార్హం.
రోదసి ప్రయోగాలు ఊపందుకొన్న నేపథ్యంలో వ్యోమగాములు పరిశోధనలు చేసుకోవడానికి, రోదసి యాత్రికులు సేదతీరడానికి ఆకాశలబ్ధి సంస్థ ‘ఎక్స్‌పాండబుల్ స్పేస్ హ్యాబిటేట్’ (ఎక్స్‌ఎస్‌హెచ్) పేరిట ఓ స్పేస్‌స్టేషన్‌ను నిర్మించనున్నది. 2023 నవంబర్‌లోనే దీనికి సంబంధించిన ప్రొటోటైప్ ‘అంతరిక్ష హబ్’ డిజైన్‌ను ఐఐటీ-రూర్కీ, ఐఐఎస్-బెంగళూరులో సిద్ధంచేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్