బుమ్రా, మంధాన‌ల‌కు ఐసీసీ అవార్డు

బుమ్రా, మంధాన‌ల‌కు ఐసీసీ అవార్డు
ఐసీసీ అవార్డుల్లో భార‌త క్రికెట‌ర్లు డ‌బుల్ ధ‌మాకా మోగించారు. ఏకంగా ఇద్ద‌రు ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు కొల్ల‌గొట్టారు. జూన్ నెల‌కుగానూ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, ఓపెన‌ర్ స్మృతి మంధానాలు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుపొందారు. టీ20 వ‌ల‌ర్డ్ క‌ప్‌లో అద‌ర‌గొట్టిన బుమ్రా పురుషుల విభాగంలో రోహిత్ శ‌ర్మ‌, ఫ‌జ‌ల్ హ‌క్ ఫారూఖీల‌ను వెన‌క్కి నెట్టి మరీ అవార్డును పొందారు. 
 
ఇక ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో సెంచ‌రీల‌తో క‌దం తొక్కిన మంధాన మ‌హిళ‌ల కేట‌గిరీలో విజేత‌గా నిలిచింది. ‘జూన్ నెల‌కు ఐసీసీ అవార్డుకు ఎంపిక‌వ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. అమెరికా, వెస్టిండీస్‌లో గ‌డిపొచ్చాక నాకు ద‌క్కిన ప్ర‌త్యేక గౌర‌వం ఇది. ఒక జ‌ట్టుగా మేము ఎన్నో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాం. ఈ అవార్డును సైతం జ‌ట్టు సంబురాల్లో భాగం చేస్తున్నా’ అని యార్క‌ర్ కింగ్ బుమ్రా వెల్ల‌డించాడు.
 
కాగా ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును ప్రవేశపెట్టిన తర్వాత ఒకే దేశానికి చెందిన పురుష, మహిళా క్రికెటర్లు ఒకే నెలలో విజేతలుగా నిలవడం ఇదే మొదటి సారి. ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం మ‌హిళ‌ల విభాగంలో మంధాన‌కు గ‌ట్టి పోటీ ఎదురైంది. భార‌త వైస్ కెప్టెన్ ఇంగ్లండ్ అమ్మాయి మియా బౌచెర్, శ్రీ‌లంక క్రికెట‌ర్ విశ్మీ గుణ‌ర‌త్నేలు రేసులో నిలిచారు. కానీ, సొంత‌గడ్డ‌పై ద‌క్షిణాఫ్రికాతో వన్డేల్లో రెండు సెంచ‌రీలు, ఏకైక టెస్టులోనూ 149 ప‌రుగుల‌తో మంధాన మెరిసింది. దాంతో, ఓట్ పోలింగ్‌లోనూ అభిమానులు ఆమెకే మ‌ద్ద‌తు తెలిపారు. దాంతో, ఐసీసీ మంధాన‌ను విజేత‌గా ప్ర‌క‌టించింది.

పొట్టి ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త జ‌ట్టు విజ‌యంలో బుమ్రా కీల‌క పాత్ర పోషించాడు. లీగ్ ద‌శ నుంచి త‌న సూప‌ర్ బౌలింగ్‌తో టీమిండియా గెలుపు గుర్రంగా మారాడు. ఇక మ్యాచ్ చేజారే ప‌రిస్థితి వ‌చ్చిన‌ ఫైన‌ల్లోనూ 18 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు తీసి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ అనిపించుకున్నాడు.

“ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. అమెరికా- వెస్టిండీస్‌లో గడిపిన సమయం మధుర జ్ఞాపకాలను ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రత్యేక అవార్డు కూడా దక్కింది. జట్టుగా మేము సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే వ్యక్తిగతంగా నా ఖాతాలో ఈ గెలుపు చేరడం మరింత సంతోషంగా ఉంది” అని బుమ్రా తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ గెలవడం తన జీవితంలో మరచిపోలేని క్షణమని చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో ఎనిమిది మ్యాచులు ఆడిన బుమ్రా 4.17 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు. అఫ్గానిస్థాన్ పేసర్‌ ఫజల్‌ హక్‌ ఫారుకీ(17), టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌(17) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. టీమ్ఇండియా ఛాంపియన్గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో అతడికి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా దక్కింది. ఈ విజయం ఇంకా మర్చిపోకముందే ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు కూడా అందుకున్నాడు.