జమ్మూ కశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలతో ఈ దాడి చేశారు. వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరుపగా, ఉగ్రవాదులు పారిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతున్నది. కుల్గాం జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయం బయటపడింది. చిన్నిగామ్ ఫీసల్ అనే గ్రామంలో జనావాసాల మధ్య ఇంటి కప్‌బోర్డులో ఉగ్రవాదులు నిర్మించుకున్న బంకర్ చూసి ఆర్మీ ఆశ్చర్యపోయింది.
కప్‌బోర్డు ద్వారా లోపలికి దూరి వెళ్లే విధంగా నిర్మించిన ఈ బంకర్ పూర్తి కాంక్రీట్‌తో నిర్మించి ఉంది. కొన్నేండ్ల క్రితం ఉగ్రవాదులు సెప్టిక్ ట్యాంక్ కింద ఇలాగే బంకర్ ఏర్పాటు చేసుకోగా, దానిని సైనికులు కనిపెట్టి ధ్వంసం చేశారు. ఇప్పుడు ఉగ్రవాదులు కిచెన్లు, అల్మరాలు, డ్రాయింగ్ రూమ్‌ల వెనుక బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఆర్మీ గుర్తించింది.
మరోవైపు రాజౌరీ వద్ద మాఝకోట్ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆర్మీ ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి సమయంలో మాచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఉగ్రవాదులు మొదట గ్రెనేడ్స్ విసిరారు. ఆ తర్వాత కాల్పలు జరిపారు. వెంటనే సైన్యం తేరుకొని కాల్పులు జరుపగా.. ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు తెలిపారు.
మరో ఆరుగురు గాయపడ్డారు. ఆర్మీ వాహనాలు లక్ష్యంగా జరిగిన ఈ ఉగ్రదాడితో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతన్ని తమ అధీనంలోకి తీసుకుని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. ఘటన అనంతరం బలగాలను రంగంలోకి దింపి ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
గత 48 గంటల్లో జమ్మూ ప్రాంతంలో సైన్యంపై దాడి జరుగడం ఇది రెండోసారి. ఆదివారం రాజౌరీ జిల్లా ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్ జిల్లాలో వేర్వేరుగా జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఉగ్రవాదులు.. సైన్యంపై మరోసారి దాడికి తెగబడ్డారు.
కాగా, దక్షణ కశ్మీర్‌లో గత రెండు మూడ్రోజులుగా చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని, దీంతో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బ తగిలిందని బిగ్రేడియర్ ప్రుధ్వీరాజ్ చౌహన్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. గత కొన్ని వారాలుగా జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. జూలైలో దోడా జిల్లాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి.

More Stories
అరుణాచల్ పై కన్ను.. అమెరికా నివేదికపై భగ్గుమన్న చైనా!
ఎట్టకేలకు మయన్మార్ లో ఆదివారం నుండి ఎన్నికలు
‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ