
మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అయితే ఈ గూగుల్ అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఒక్క స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ఎలాంటి సమాచారానైనా సెకన్లలో తెలుసుకోవచ్చు. మరిఅలాంటి గూగుల్ మొరాయిస్ ప్రపంచం అష్టదిగ్భందం అయిపోతుంది.
ఈ క్రమంలో సమాచార వ్యాప్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంలో ఇస్త్రో అద్భుతమైన విజయం సాధించింది. సామాజిక అవసరాల కోసం ఓ టూల్ రూపొందించింది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడి ముందుకు సాగుతోంది. ఇటీవల చంద్రయాన్ 3 అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలను మనవైపు తిప్పుకునేలా చేశాం.
తాజాగా ఇస్ట్రో మరో అద్భుత సృష్టి అందరినీ ఆకర్షిస్తోంది. సమాచార సామర్థ్యం పెంపొందించుకోవడం కోసం ఇస్రో తన జియో పోర్టల్ ‘భువన్’ ద్వారా అద్భుత పురోగతిని సాధిస్తుంది. సామాజిక అవసరాల కోసం భవన్ టూల్ ఏర్పాటు చేసింది. ప్రపంచ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కన్నా 10 రెట్లు అధికంగా వివరాలతో కూడిన సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల వెల్లడించారు.
విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, అగ్రికల్చర్ లాంటి పలు రంగాలకు ఉపయోగపడే విలువైన సమాచారం ‘భవన్’ టూల్ అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ టూల్ తో పాటుగా భువన్ – పంచాయత్, ఎన్‌డీఈఎం (నేషనల్ డాటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్) అనే మరో 2 కొత్త టూల్స్ ని కూడా ప్రవేశ పెట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.
మెరుగైన అనలిటికల్ టూల్స్, డాటా సెట్లు సరఫరా చేయడం ద్వారా స్థానిక పాలనా వ్యవస్థలకు మంచి తోడ్పాటు అవుతుందనే లక్ష్యంతో భువన్ – పంచాయత్ టూల్‌ని రూపొందించినట్లు తెలిపారు. జియో స్పెషియల్ డాటా ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ టూల్స్ ద్వారా లభిస్తుందని వివరించారు.
భువన్ సంస్కృత పదం “ఎర్త్” నుండి ఉద్భవించింది. ఇది ఇండియన్ రిమోట్ సెన్సింగ్ (ఐఆర్ఎస్) ఉపగ్రహాల ద్వారా భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ప్రదర్శించడానికి రూపొందించబడిన ఇస్రో జియో పోర్టల్. ఈ ఉచిత సాఫ్ట్‌వేర్ వినియోగదారులను 2డి, 3డి బహుళ- సెన్సర్, బహుళ- తాత్కాలిక ఉపగ్రహ చిత్రాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
ఇది ఇంటరాక్టివ్, బహుముఖ ఎర్త్ బ్రౌజర్‌గా పనిచేస్తుంది. వెక్టార్ లేయర్‌లుగా అందించబడిన చిత్రాల నుండి ఉద్భవించిన బ్యాగ్రౌండ్ డేటాను ఎన్‌లార్జ్ చేసే ఆప్షన్‌ను అందిస్తుంది. అలాగే భువన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ (ఎడబ్ల్యుఎస్) నుండి నిజ-సమయ వివరాలను పొందుపరిచింది, అటవీ అగ్ని హెచ్చరికలు, వ్యవసాయ కరువు కాలానుగుణ అంచనాలు, ఇతర లక్షణాలతో పాటు సంభావ్య ఫిషింగ్ జోన్‌ల (పి ఎఫ్ జెడ్) డేటా వంటి విపత్తు-సంబంధిత సమాచారం అందించడంలో సహాయపడుతుంది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము